Shriya Saran: నా ఈ 20 ఏళ్ల ప్రయాణానికి అదే కారణం.. సినీ, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీయ..

Shriya Saran: 2001లో వచ్చిన 'ఇష్టం' సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల నటి శ్రీయా శరణ్‌. తొలి సినిమాతోనే తన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది అనతికాలంలోనే..

Shriya Saran: నా ఈ 20 ఏళ్ల ప్రయాణానికి అదే కారణం.. సినీ, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీయ..
Shirya Saran
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 08, 2021 | 7:32 AM

Shriya Saran: 2001లో వచ్చిన ‘ఇష్టం’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల నటి శ్రీయా శరణ్‌. తొలి సినిమాతోనే తన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగారు శ్రీయా. టాలీవుడ్‌లో ఉన్న దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ చిన్నది, తెలుగుతోపాటు హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోయింది. శ్రీయా శరణ్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సరిగ్గా 20 ఏళ్లు ముగిసింది. 20 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ ఆఫర్లను దక్కించుకుంటుండడం విశేషం. ఇక తాజాగా శ్రీయా.. ‘గమనం’ చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు రానున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపు, జ్ఞానశేఖర్ వి.ఎస్. నిర్మించిన ఈ సినిమాకి సుజనారావు దర్శకత్వం వహించారు. గమనం సినిమా ఈనెల 10న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో శ్రీయా శరణ్‌ తాజాగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గమనం చిత్రంలో దివ్యాంగురాలు కమల పాత్రలో కనిపిస్తున్నానని తెలిపిన శ్రీయ.. ఈ సినిమా కథ విన్నప్పుడు ఏడ్చానని, కథకు, కమల పాత్రకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను. నిస్సహాయతతో ఉన్న ఓ మహిళ సాగించే ప్రయాణమే కమల జీవితం. ఈ పాత్ర కోసం బట్టలు కుట్టడం నేర్చుకున్నానని తెలిపారు. ఈ సినిమాకు ఇళయరాజాగారితో వర్క్‌ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపిన శ్రియ.. తన తర్వాతి సినిమా ‘మ్యూజిక్‌ స్కూల్‌’కి కూడా ఆయనే సంగీత దర్శకులని చెప్పుకొచ్చారు. ఇక తన సినీ కెరీర్‌ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రియ.. ‘నా సుదీర్ఘమైన ప్రయాణానికి ప్రేక్షకుల ప్రేమే కారణమని నమ్ముతాను. మరో ఇరవయ్యేళ్లు ప్రేక్షకుల ప్రేమను పొందాలని ఉంది. అందుకు కష్టపడతాను. అక్కినేని నాగేశ్వరరావుగారు చివరి క్షణం వరకు నటించారు. ‘మనం’ సినిమా సమయంలో ‘ఒకవేళ నేను చనిపోతే ఈ సినిమా చేసే చనిపోతాను’ అని ఆయన అన్న మాటలు నాకు గుర్తున్నాయి. ఆయనలా నాక్కూడా చివరి క్షణం వరకూ నటించాలని ఉంది’అని చెప్పుకొచ్చారు.

ఇటీవల ఓ చిన్నారికి జన్మనిచ్చిన శ్రియ ఆ విషయమై మాట్లాడుతూ.. ‘పదినెలల క్రితమే బార్సిలోనాలో నేను ఓ పాపకు జన్మనిచ్చాను. నాకు పాప పుట్టాలనే కోరుకున్నాను. ‘రాధారాణి’ పేరును మా అమ్మగారు సూచించారు. రష్యన్‌ భాషలో రాధ అంటే హ్యాపీ అని మా ఆయన ఆండ్రీ అన్నారు. సంస్కృతంలో కూడా హ్యాపీ అనే అర్థం వస్తుంది. అందుకని ‘రాధ’ అని పెట్టాం. రాధ వచ్చిన తర్వాత మా లైఫ్‌ మారిపోయింది’ అంటూ చెప్పుకొచ్చిందీ తార.

Also Read: Sudha Murthy: సుధా మూర్తి నిరాడంబర జీవితం.. వైరల్‎గా మారిన వీడియో..

Diamond: రైతును వరించిన అదృష్టం.. తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన వజ్రం..

Arrested: మూడు రోజుల్లో ఐదుసార్లు అరెస్ట్ అయ్యాడు.. అదీ నేరం చేయకుండానే..