Diamond: రైతును వరించిన అదృష్టం.. తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన వజ్రం..
రైతు ములాయం సింగ్ సోమవారం మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా రూ. 50 లక్షలకు పైగా విలువైన 13 క్యారెట్ల వజ్రం బయటపడింది...
రైతు ములాయం సింగ్ సోమవారం మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా రూ. 50 లక్షలకు పైగా విలువైన 13 క్యారెట్ల వజ్రం బయటపడింది. దీంతో అతని తలరాతే మారిపోయింది. పన్నా వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది. గతంలో ధూళిలో విలువైన రత్నాన్ని వెలికితీసినప్పుడు చాలా మంది ధనవంతులు అయ్యారు. అయినప్పటికీ, 13.47 క్యారెట్ల బరువున్న నాణ్యమైన వజ్రాన్ని తవ్వినప్పుడు ములాయం సింగ్ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. అతను, తన భాగస్వాములతో కలిసి తవ్వినప్పుడు మరో ఆరు చిన్న వజ్రాలు కనుగొన్నారు.
ముడి వజ్రం మార్కెట్ ధర దాదాపు రూ.50 లక్షలు ఉంటుందని డైమండ్ కార్యాలయానికి చెందిన అనుపమ్ సింగ్ తెలిపారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వేలంలో వాస్తవ ధరను నిర్ణయిస్తామని చెప్పారు. వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించిన తర్వాత రైతుకు ఇస్తారు. ఆనందానికి గురైన ములాయం సింగ్ తనకు ఆరుగురు భాగస్వాములు ఉన్నారని, వజ్రాల వేలం మొత్తాన్ని వారితో సమానంగా పంచుకుంటానని చెప్పాడు.
ఆ డబ్బును తన పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తానని చెప్పాడు. పన్నా జిల్లాలో 12 లక్షల క్యారెట్ల వజ్రాల నిల్వలు ఉన్నాయని అంచనా. మధ్యప్రదేశ్ ప్రభుత్వం పన్నా డైమండ్ రిజర్వ్ ప్రాంతంలో స్థానిక రైతులు, కార్మికులకు వజ్రాలను తవ్వడానికి, వాటిని జిల్లా మైనింగ్ అధికారి వద్ద జమ చేయడానికి భూమిని లీజుకు ఇస్తుంది.
Read Also.. Farmers Protest: రైతుల ఆందోళన విరమించే అవకాశం.. రేపు తుది నిర్ణయం ప్రకటించనున్న రైతు సంఘాల ఐక్యవేదిక!