Vikranth Rona: కిచ్చా సుదీప్ 3 డీ మూవీ విక్రాంత్ రోణ‌.. రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రయూనిట్..

క‌న్నడ బాద్ షా కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న లేటేస్ట్ చిత్రం విక్రాంత్ రోణ‌. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, గ్లింప్స్‌ సినిమాపై

Vikranth Rona: కిచ్చా సుదీప్ 3 డీ మూవీ విక్రాంత్ రోణ‌.. రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రయూనిట్..
Kicha Sudeep
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 08, 2021 | 7:00 AM

క‌న్నడ బాద్ షా కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న లేటేస్ట్ చిత్రం విక్రాంత్ రోణ‌. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, గ్లింప్స్‌ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. త్రీ డీ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవ‌రి 24న విడుద‌ల చేయ‌బోతున్నట్లు మేక‌ర్స్ జాక్ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌, అలంకార్ పాండియ‌న్ తెలియ‌జేశారు. కిచ్చా సుదీప్‌తో, నిరూప్ భండారి, నీతా అశోక్‌, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రధారులుగా న‌టించారు. రిలీజ్ డేట్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో కిచ్చా సుదీప్.. ఫాంటమ్ అనే స్టైలిష్ బైక్‌తో క‌నిపిస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఇస్తూ అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చారు. ఇప్పుడు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌డంతో త్రీ డీ మూవీగా విక్రాంత్ రోణ ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు.

నిర్మాత జాక్ మంజునాథ్ మాట్లాడుతూ ‘‘మిస్టరీ థ్రిల్లర్‌గా 3 డీ టెక్నాలజీలో రూపొందించిన ‘విక్రాంత్ రోణ‌’ను ఫిబ్రవ‌రి 24న విడుద‌ల చేస్తున్నాం అని తెలియ‌చేయ‌డానికి సంతోషిస్తున్నాం. మ‌న ప్రేక్షకులు చాలా గొప్పవాళ్లు. డిఫ‌రెంట్ సినిమాల‌ను ఎంక‌రేజ్ చేస్తారు. వారిపై న‌మ్మకంతో త్రీ డీ మూవీగా విక్రాంత్ రోణ‌ను రూపొందించాం’’ అన్నారు.

ద‌ర్శకుడు అనూప్ భండారి మాట్లాడుతూ.. థియేటర్స్ సినిమాను ఎంజాయ్ చేసే ప్రేక్షకుల‌కు అద్భుత‌మైన అనుభూతిని అందించ‌డానికి విక్రాంత్ రోణ చిత్రాన్ని రూపొందించాం. త్రీ డీ టెక్నాల‌జీతో రూపొందించిన ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌లోనే ఎంజాయ్ చేయాలి. ఈ ప్రపంచానికి స‌రికొత్త సూప‌ర్ హీరోను ప‌రిచ‌యం చేస్తున్నాం. పిల్లల నుంచి పెద్దల వ‌ర‌కు విజువ‌ల్ ట్రీట్‌గా సినిమా అల‌రిస్తుంది. ఫిబ్రవ‌రి 24న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకుల‌తో పాటు మేం కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం అన్నారు.

జీ స్టూడియోస్ సమర్పణలో నిర్మితమైన విక్రాంత్‌ రోణా మల్టిలింగ్వుల్‌ యాక్షన్‌ అడ్వంచర్‌. 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీ లో విడుదల చేస్తున్నారు ఈ సినిమాను. అనూప్‌ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్‌ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌ నిర్మాతలు. అలంకార్‌ పాండ్యన్‌ సహ నిర్మాత. బి.అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. అవార్డ్ విన్నింగ్‌ ఆర్ట్ డైరక్టర్‌ మెస్మరైజ్‌ చేసే సెట్స్ వేశారు. విలియమ్‌ డేవిడ్‌ కెమెరాపనితనం విజువల్‌ ఫీస్ట్ గ్యారంటీ అనే ఫీలర్స్ ఇస్తోంది. కిచ్చా సుదీప్‌, నిరుప్‌ భండారి, నీతా అశోక్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: Vivek Oberoi: ఇక్కడ ప్రతిభ కంటే ఇంటి పేరుకే ప్రాధాన్యం.. బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వివేక్‌ ఓబెరాయ్‌..

Katrina kaif- Vicky Kaushal: విక్ట్రీనా పెళ్లి ఫుటేజీ కోసం పోటీ పడుతోన్న ప్రముఖ ఓటీటీ !.. రూ. 100 కోట్ల భారీ ఆఫర్‌!

బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
హీరో కాకపోతే వెంకటేశ్ ఏమయ్యేవారో తెలుసా..?
హీరో కాకపోతే వెంకటేశ్ ఏమయ్యేవారో తెలుసా..?
వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!