Sai Pallavi: ‘మీరు రాసిన ప్రతీ పదం మీ ఆత్మను తీసుకు వస్తోంది’.. సిరి వెన్నెల చివరి పాటపై సాయి పల్లవి ఎమోషనల్‌..

Sai Pallavi: సినీ గేయ రచయిత సిరి వెన్నెల లేరన్న వార్తను ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతీ రోజూ ఆయన పాట విననిదే దిన చర్యను ప్రారంభించని వారు కొందరైతే, రాత్రి పడుకునే ముందు..

Sai Pallavi: 'మీరు రాసిన ప్రతీ పదం మీ ఆత్మను తీసుకు వస్తోంది'.. సిరి వెన్నెల చివరి పాటపై సాయి పల్లవి ఎమోషనల్‌..
Sai Pallavi Sirivennela
Follow us
Narender Vaitla

| Edited By: Rajeev Rayala

Updated on: Dec 08, 2021 | 2:22 PM

Sai Pallavi: సినీ గేయ రచయిత సిరి వెన్నెల లేరన్న వార్తను ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతీ రోజూ ఆయన పాట విననిదే దిన చర్యను ప్రారంభించని వారు కొందరైతే, రాత్రి పడుకునే ముందు ఓ ఇన్‌స్ప్రేషన్‌ పాట వినే వారు మరికొందరు. ఇలా ఎంతో మంది జీవితంలో ఓ భాగమైపోయిన సిరివెన్నెలను ఆయన ఫ్యాన్స్‌ చాలా మిస్‌ అవుతున్నారు. ఇక నుంచి ఆయన రాసిన పాట రాదనే భావనను తీసుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే 1986లో ‘సిరివెన్నెల’తో మొదలైన సీతారామశాస్త్రి పాటల ప్రస్థానం.. శ్యామ్‌ సింగరాయ్‌తో ముగిసింది. నాని, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన ఈ చిత్రంలో సిరివెన్నెల రెండు పాటలు రాశారు.

వీటిలో సిరి వెన్నెల రాసిన చివరి పాటను చిత్ర యూనిట్‌ మంగళవారం విడుదల చేసింది. ఈ పాట ‘సిరివెన్నెల’ అంటూ సాగడం ఈ పాట ప్రత్యేకత. ప్రస్తుతం ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. సిరివెన్నెల పదాల్లోని మ్యాజిక్‌ను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఈ పాట గురించి సాయిపల్లవి ఎమోషనల్‌ అయ్యారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకు వస్తోంది. ఎప్పటికీ మీరు మా హృదయాల్లో జీవించే ఉంటారు సార్‌’ అంటూ పేర్కొన్నారు. ఇక శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రాన్ని ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరి సిరివెన్నెల రాసిన ఆ చివరి పాటను మీరూ ఓ సారి వినేయండి..

Also Read: K.G.F: Chapter 2: శరవేగంగా కేజీఎఫ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. డబ్బింగ్ పూర్తి చేసిన అధీరా..

Akhanda Movie: బోయపాటి శ్రీనును కలిసిన తెలంగాణ గౌడ సంఘాలు.. ఇంతకీ విషయమేంటంటే..

Viral Video: ఒకే చోట ఇద్దరు క్రికెట్ లెజెండ్స్.. వైరల్‎గా మారిన వీడియో..