K.G.F: Chapter 2: శరవేగంగా కేజీఎఫ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. డబ్బింగ్ పూర్తి చేసిన అధీరా..
ఒక్క సినిమాతో అన్నిభాషల్లో స్టార్ హీరో క్రేజ్ సొంతం చేసుకున్నాడు యశ్. కేజీఎఫ్ సినిమా అంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.
K.G.F: Chapter 2: ఒక్క సినిమాతో అన్నిభాషల్లో స్టార్ హీరో క్రేజ్ సొంతం చేసుకున్నాడు యశ్. కేజీఎఫ్ సినిమా అంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే అత్యంత విజయాన్ని అందుకున్న భారీ బడ్జెట్ చిత్రంగా కేజీఎఫ్ సినిమా నిలిచింది. ఇక ఈ మూవీ సీక్వెల్గా కేజీఎఫ్ 2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ మూవీకి కరోనా బ్రేక్ వేసింది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ కేజీఎఫ్ 2 పై మరింత క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమా కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎట్టకేలకు 2022 ఏప్రిల్ 14న విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కేజీఎఫ్ కు సీక్వెల్ గా రూపొందిన కేజీఎఫ్ 2 విడుదల తేదీ విషయంలో ఇప్పటికే పలు సార్లు మార్పు వచ్చింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. మళ్ళీ ఈసినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశాలు కూడా లేక పోలేదు. ఇక ఈ సినిమాలో విలన్ గా నటిస్తునందు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్. తాజాగా సంజయ్ దత్ తో అధీరా పాత్రకు డబ్బింగ్ చెప్పించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కేవలం హిందీ వర్షన్ లో మాత్రమే సంజయ్ దత్ వాయిస్ వినిపిస్తుందా.. లేదంటే అన్ని భాషల్లో కూడా ఆయన మాటే ఉంటుందా అంటూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇక ఇటీవల విడుదల చేసిన టీజర్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చదవండి :