RRR Movie: రామ్‌ ట్రైలర్‌ టీజ్‌ను విడుదల చేసిన భీమ్‌.. ఆకట్టుకుంటోన్న చెర్రీ లుక్స్‌..

RRR Movie: రామ్‌ ట్రైలర్‌ టీజ్‌ను విడుదల చేసిన భీమ్‌.. ఆకట్టుకుంటోన్న  చెర్రీ లుక్స్‌..

ప్రస్తుతం యావత్‌ భారతీయ సినిమా పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి చారిత్రక నేపథ్యంతో ఈ పాన్

Basha Shek

|

Dec 07, 2021 | 2:22 PM

ప్రస్తుతం యావత్‌ భారతీయ సినిమా పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి చారిత్రక నేపథ్యంతో ఈ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు.  మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్నారు. అలియా భట్‌, ఒలివియా మోరీస్‌, శ్రియా శరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా సినిమా విడుదల తేఈ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే డిసెంబర్‌ 9న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.కాగా ఈ సినిమాలో కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, అల్లూరి పాత్రలో రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. ఈక్రమంలో ట్రైలర్‌కు ముందే ప్రేక్షకులకు వరుస సర్‌ప్రైజ్‌లు ఇస్తోంది చిత్ర బృందం. సోమవారంసినిమాలోని ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కొత్త లుక్స్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరో వీడియోను పంచుకుంది.

కాగా ఈ వీడియోను ‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ రామ్’ అంటూ తన ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఇందులో భాగంగా ట్రైలర్‌లో రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన ఒక సన్ని వేశాన్ని కట్‌ చేసి ఈ వీడియోను రూపొందించారు. పోలీస్‌ డ్రెస్‌ ధరించిన చెర్రీ మంటల్లోంచి నడుచుకురావడం ఈ క్లిప్‌లో మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్‌చరణ్ లుక్స్‌కు అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Also Read:

Vivek Oberoi: ఇక్కడ ప్రతిభ కంటే ఇంటి పేరుకే ప్రాధాన్యం.. బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వివేక్‌ ఓబెరాయ్‌..

Samantha on Pushpa Trailer: పుష్ప ట్రైలర్ పై సమంత ఆసక్తికర ట్వీట్.. ఏమన్నదో తెలుసా..

Katrina kaif- Vicky Kaushal: విక్ట్రీనా పెళ్లి ఫుటేజీ కోసం పోటీ పడుతోన్న ప్రముఖ ఓటీటీ !.. రూ. 100 కోట్ల భారీ ఆఫర్‌!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu