Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Katrina kaif- Vicky Kaushal: విక్ట్రీనా పెళ్లి ఫుటేజీ కోసం పోటీ పడుతోన్న ప్రముఖ ఓటీటీ !.. రూ. 100 కోట్ల భారీ ఆఫర్‌!

ప్రస్తుతం బాలీవుడ్‌లో కత్రినా కైఫ్‌ - విక్కీ కౌశల్‌ల వివాహం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్’ అనే విలాసవంతమైన హోటల్‌ వేదికగా ఏడడుగులు నడవనున్నారు

Katrina kaif- Vicky Kaushal: విక్ట్రీనా పెళ్లి ఫుటేజీ కోసం పోటీ పడుతోన్న ప్రముఖ ఓటీటీ !.. రూ. 100 కోట్ల భారీ ఆఫర్‌!
Follow us
Basha Shek

|

Updated on: Dec 07, 2021 | 1:28 PM

ప్రస్తుతం బాలీవుడ్‌లో కత్రినా కైఫ్‌ – విక్కీ కౌశల్‌ల వివాహం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్’ అనే విలాసవంతమైన హోటల్‌ వేదికగా ఏడడుగులు నడవనున్నారు. డిసెంబర్ 9న సాయంత్రం ఈ వివాహం జరగనుందని కత్రినా, విక్కీల సన్నిహితులు చెబుతున్నారు. కాగా నేటినుంచి ప్రి వెడ్డింగ్‌ వేడుకలు ప్రారంభం కానున్నాయి. కాగా కత్రినా- విక్కీల కుటుంబ సభ్యులు ఇప్పటికే రాజస్థాన్‌ చేరుకున్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో పాటు మొత్తం 120 మంది అతిథులు ఈ వివాహానికి హాజరుకాబోతున్నారని సమాచారం. అయితే ఈ వివాహ వేడుకలో ఫొటోలు, సెల్ఫీలు తీయడానికి అవకాశం లేదని .. ఈ షరతులు, నిబంధనలపై ఆహ్వానితులకు ముందే సమాచారమిచ్చారని తెలుస్తోంది. అయితే ఈ నిబంధనల వెనక వాణిజ్య పరమైన ఒప్పందాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఓటీటీ…ఇదే మొదటిసారి.. ఈ క్రమంలో కత్రినా-విక్కీల వివాహానికి సంబంధించి ఫొటోలు, వీడియోల ప్రసార హక్కులను దక్కించుకునేందుకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోందట. పెళ్లి ఫొటోలు, వీడియోలతో పాటు నూతన వధూవరుల ఇంటర్వ్యూలు, అతిథుల అభిప్రాయాలు, తదితర కార్యక్రమాలను కవర్‌ చేసేందుకు గాను మొత్తం రూ. 100కోట్ల భారీ ఆఫర్‌ను ప్రకటించిందట. ఈమేరకు కత్రినా- విక్కీలతో సంప్రదింపులు కూడా జరిపిందట. అయితే ఈ విషయంలో కాబోయే వధూవరులు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కాగా సెలబ్రిటీల పెళ్లి ఫొటోలు, వీడియోలు, లైవ్‌ కోసం పోటీ పడడం ఇదేమీ మొదటిసారి కాదు. అయితే, ఒక ఓటీటీ సంస్థ వివాహావేడుక ప్రసార హక్కులను పొందేందుకు ప్రయత్నించడం ఇదే మొదటిసారి. కత్రినా, విక్కీలకు భారీగా ఫాలోయింగ్‌ ఉండడం, ఈమేరకు జనాలు కూడా వీరి పెళ్లి చూడడానికి ఆసక్తి చూపిస్తారని అందుకే ఓటీటీలు కవరేజ్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తోంది.

Also Read:

Prabhas: ఏపీ వరద బాధితులకు అండగా ప్రభాస్.. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‏కు రూ. కోటి విరాళం..

Samantha: విడాకులపై తొలిసారిగా స్పందించిన సమంత.. ఆ సమయంలో చనిపోతానని..

Bigg Boss : ప్రేమ పేరుతో నగలు, నగదు తీసుకుని పారిపోయాడు.. పోలీసులను ఆశ్రయించిన బిగ్‌బాస్‌ నటి..