Samantha: విడాకులపై తొలిసారిగా స్పందించిన సమంత.. ఆ సమయంలో చనిపోతానని..

Samantha: విడాకులపై తొలిసారిగా స్పందించిన సమంత..  ఆ సమయంలో చనిపోతానని..
Samantha

ఏమాయ చేసావే అంటూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది సమంత. అతి తక్కువ సమయంలోనే తన నటనతో

Rajitha Chanti

|

Dec 07, 2021 | 12:53 PM

ఏమాయ చేసావే అంటూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది సమంత. అతి తక్కువ సమయంలోనే తన నటనతో టాలీవుడ్ అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాప్ హీరోయిన్‏గా కోనసాగింది సమంత. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహాం చేసుకుంది సామ్. పెళ్లి తర్వాత సమంత లేడీ ఒరియేంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. నాగచైతన్య సమంత.. టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ అంటూ అక్కినేని అభిమానులు పిలుచుకునేవారు. అయితే అనుహ్యంగా వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నట్లుగా అక్టోబర్ 2న ప్రకటించి అందరికి షాకిచ్చారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడానికి కారణాలను మాత్రం బయటపెట్టలేదు. సామ్… చైతూ విడిపోవడంతో అక్కినేని అభిమానులతోపాటు.. సినీ ప్రముఖులు సైతం బాధపడ్డారు.

విడాకుల ప్రకటన అనంతరం సమంత తిరిగి తన కెరీర్ పై దృష్టి పెట్టింది. గత కొద్ది రోజులుగా తన సోషల్ మీడియా ఖాతాలో మోటివేషనల్ కోట్స్ పెడుతూ.. తన మానసిక పరిస్థితిని తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలపై.. పరిస్థితుల గురించి ఇటు సమంతగానీ.. నాగచైతన్య గానీ స్పందించలేదు.. తాజాగా సమంత విడాకుల అనంతరం తాను ఎదుర్కోన్న మానసిక ఒత్తిడిని సమస్య గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టింది.

ఇటీవల ఫిల్మ్ ఫేర్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. మీరు చేడు రోజులను ఎదుర్కోంటే పర్వలేదు.. వాటి గురించి అర్థం చేసుకోండి.. ఏదైనా పనిని మధ్యలోనే ఆపివేసే పరిస్థితి వస్తే దానిని అంగీకరించండి. సమస్యలతో పోరాడుతునే ఉండండి.. అది ఎప్పటికీ అంతంలేని ఓ యుద్ధం. ఇది నా సమస్య.. అంటే ఏంటీ.. నేను ఇంకా నా జీవితాన్ని గడపాలి.. నాకు తెలుసు నా జీవితాన్ని ఇంకా గడపాల్సి ఉందని.. ప్రస్తుతం నేను వ్యక్తిగత జీవితంలో ఎదుర్కోంటున్న అన్ని సమస్యలతో పోరాడుతూ.. నేను ఎంత బలంగా ఉన్నానని నేనే ఆశ్చర్యపోతున్నాను. మొదట్లో నేను చాలా బలహీనురాలిని అనుకున్నాను. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత నేను కృంగిపోయి చనిపోతానని అనుకున్నాను.. కానీ ఇంత బలంగా ఉంటాను అనుకోలేదు. ఈరోజు ఇలా ఉన్నానంటే నాకు చాలా గర్వంగా ఉంది.. ఇలా ఎలా ఉన్నానో నాకు తెలియడం లేదు అంటూ చెప్పుకొచ్చింది సమంత.

నేను నా మొదటి సినిమాతోనే విజయం పొందాను.. మీరు అనుకుంటారు.. ఈ అమ్మాయి రాగానే జాక్ పాట్ కొట్టింది.. చాలా సంతోషంగా ఉండాలని.. కానీ నేను మీరు అనుకుంటున్నట్టు కాదు.. నాకేందుకు అర్హత లేదు.. నేను ఇతర అమ్మాయిల మాదిరిగా కాదు.. నేను వారిలా ఉండను..ఎందుకంటే నన్ను అది మరింత నాశనం చేస్తుంది. ప్రేక్షకుల నుంచి పొందుతున్న ప్రేమకు నేను సరిపోను.. ఇప్పుడు చేస్తున్న ఈసినిమాలకు కూడా సరిపోతానని అనుకోను.. ఇలాంటి ప్రశ్నలన్ని నన్ను నేను ప్రశ్నించుకోవడం మానేశాను అంటూ చెప్పుకొచ్చింది సమంత.

Also Read: Siddarth: నాగాలాండ్ ఘటనపై హీరో సిద్ధార్థ్ ఫైర్.. జవాబుదారీతనం ఎక్కడుంది అంటూ ప్రభుత్వాలకు సూటీ ప్రశ్న..

Bigg Boss : ప్రేమ పేరుతో నగలు, నగదు తీసుకుని పారిపోయాడు.. పోలీసులను ఆశ్రయించిన బిగ్‌బాస్‌ నటి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu