Siddarth: నాగాలాండ్ ఘటనపై హీరో సిద్ధార్థ్ ఫైర్.. జవాబుదారీతనం ఎక్కడుంది అంటూ ప్రభుత్వాలకు సూటీ ప్రశ్న..
బాయ్స్ సినిమాతో హీరోగా ఆకట్టుకున్న సిద్ధార్థ్.. ఆ తర్వాత తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ వచ్చారు. బొమ్మరిల్లు
బాయ్స్ సినిమాతో హీరోగా ఆకట్టుకున్న సిద్ధార్థ్.. ఆ తర్వాత తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ వచ్చారు. బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేశారు టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్. అలాగే నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. కొంచెం ఇష్టం..కొంచెం కష్టం సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నాడు. ఇక ఆ తర్వాత సిద్ధార్థ్ చేసిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తెలుగులో సిద్ధార్థ్ సినిమాలు తగ్గిపోయాయి. అనంతరం సిద్ధార్త్ తమిళ్ ఇండస్ట్రీ పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇక సిద్ధార్థ్ కేవలం సినీ రంగంలో జరుగుతున్న ఘటనలు.. పరిస్థితులపైనే కాకుండా.. సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా తనదైన శైలీలో స్పందిస్తుంటారు.
అనేక సందర్భాల్లో ప్రభుత్వాలను సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంటారు. అలాగే తనను ఎంతమంది ట్రోల్ చేసిన వాటిని పట్టించుకోకుండా.. తన పనులు తాను చూసుకుంటాడు. గతంలో సినిమా టికెట్ట్ ధరలపై హీరో సిద్ధార్థ్ తెలుగు రాష్ట్రా ప్రభుత్వాల తీరుపై తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా సిద్ధార్థ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చురకలంటిచాడు.. ఇటీవల నాగాలాండ్‌లో జరిగిన ఘటనపై సిద్ధార్థ్ ఫైర్ అయ్యారు. నాగాలాండ్‌లోని మయన్మార్ సరిహద్దు మోన్ జిల్లాలో భద్రతా బలగాలు శనివారం జరిపిన కాల్పులు వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు అనుకొని సామాన్య పౌరులపై కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడి స్థానికులు భద్రత బలగాలపై మూకుమ్మాడి దాడి చేశారు.
అలాగే తమిళనాడులో ఓ విద్యార్థిని లాకప్ డెత్ చేశారని సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. నాగాలాండ్‌లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో మరో కస్టోడియల్ డెత్ జరిగింది. ఈసారి స్టూడెంట్ ను బలి తీసుకున్నారు. జవాబుదారీతనం ఎక్కడుంది ? కాపాడాల్సిన వారే ఇలాంటివి చేస్తుంటే ఇంకెలా? అంటూ సిద్ధార్థ్ ప్రశ్నించాడు.
ట్వీట్..
Innocent civilians murdered in cold blood by the armed forces in #Nagaland…another custodial death by #police in #TamilNadu this time a student.
Where is the accountability? Why is so much apathy seen in our supposed protectors?
— Siddharth (@Actor_Siddharth) December 6, 2021
Also Read: Gamanam Movie: అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. కానీ.. ఆసక్తికర కామెంట్స్ చేసిన గమనం హీరో..