Samantha on Pushpa Trailer: పుష్ప ట్రైలర్ పై సమంత ఆసక్తికర ట్వీట్.. ఏమన్నదో తెలుసా..

Samantha on Pushpa Trailer: పుష్ప ట్రైలర్ పై సమంత ఆసక్తికర ట్వీట్.. ఏమన్నదో తెలుసా..
Samantha On Pushpa Trailer

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం పుష్ప కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎర్ర చందనం

Rajitha Chanti

|

Dec 07, 2021 | 1:53 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం పుష్ప కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన శ్రీవల్లి పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ అనే టైటిల్‏తో ఈనెల 17న విడుదల చేయనున్నారు.

ఇక పుష్ప విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో డిసెంబర్ 6న పుష్ప ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ట్రైలర్‏లో బన్నీ తన నట విశ్వరూపం చూపించారు. పూర్తిగా లారీ డ్రైవర్‏గా ఊర మాస్ పాత్రలో ఇరగదీశాడు. యాక్షన్ సన్నివేశాలతో తగ్గేదేలే అన్నట్టుగా ఉంది పుష్ప ట్రైలర్. ఇదిలా ఉంటే.. తాజాగా పుష్ప ట్రైలర్ పై హీరోయిన్ సమంత స్పందించింది. పుష్పరాజ్.. తగ్గేదేలే అని రాసి ఫైర్ ఎమోజీస్ ట్వీట్ చేసింది సామ్. ఇక సమంత ఇందులో స్పెషల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో అనసూయ, సునీల్, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Siddarth: నాగాలాండ్ ఘటనపై హీరో సిద్ధార్థ్ ఫైర్.. జవాబుదారీతనం ఎక్కడుంది అంటూ ప్రభుత్వాలకు సూటీ ప్రశ్న..

Gamanam Movie: అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. కానీ.. ఆసక్తికర కామెంట్స్ చేసిన గమనం హీరో..

Pooja Hegde: మీ ఇద్దరిని స్ర్కీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తోంది.. చరణ్‌, తారక్‌ న్యూ లుక్స్‌పై పూజా హెగ్డే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu