Vivek Oberoi: ఇక్కడ ప్రతిభ కంటే ఇంటి పేరుకే ప్రాధాన్యం.. బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వివేక్‌ ఓబెరాయ్‌..

బాలీవుడ్‌లో ట్యాలెంట్‌ కంటే ఇంటిపేర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు . తాను 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ

Vivek Oberoi: ఇక్కడ ప్రతిభ కంటే ఇంటి పేరుకే ప్రాధాన్యం.. బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వివేక్‌ ఓబెరాయ్‌..
Follow us
Basha Shek

|

Updated on: Dec 07, 2021 | 2:13 PM

బాలీవుడ్‌లో ట్యాలెంట్‌ కంటే ఇంటిపేర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు . తాను 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ…నేటికీ తన ప్రయాణం ఎంతో కష్టంగా ఉందని ఆయన వాపోయారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో బంధుప్రీతి (నెపోటిజం)పై చర్చ సాగుతున్న నేపథ్యంలో వివేక్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా ఆయన హీరోగా నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ 3వ సీజన్‌ ఇటీవల విడుదలైంది. క్రీడానేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో వివేక్‌తో పాటు రీచాచద్దా, అంగద్‌ బేడీ, సిద్ధాంత్‌ చతుర్వేదీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులోని మొదటి రెండు సీజన్లు సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచాయి. తాజాగా మూడో సీజన్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీని ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వివేక్‌…హిందీ చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘నేను 20 ఏళ్లుగా సినిమ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. అయినా నేటికీ ఎన్నో ఇబ్బందులతో నా సినిమా ప్రయాణం కొనసాగుతోంది. హిందీ చిత్ర పరిశ్రమ యువ ప్రతిభను పెంచి పోషించే ఒక వ్యవస్థను అభివృద్ధి చేసుకోలేకపోయింది. చాలామంది బాలీవుడ్‌ని ఒక ఎక్స్‌క్లూజివ్‌ క్లబ్‌గా మార్చేశారు. ఇక్కడ అడుగుపెట్టాలంటే ప్రతిభకంటే ఇంటిపేరే ప్రముఖ పాత్ర పోషిస్తు్ంది. బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకోవాలంటే ఇంటిపేరు ప్రముఖులదై ఉండాలి లేదా ప్రముఖులు ఎవరైనా తెలిసి ఉండాలి. లేకపోతే ఎవరో ఒకరి గ్రూప్‌లో చేరి ఉండాలి. వారికి మాత్రమే బాలీవుడ్‌లో అవకాశాలు దక్కుతాయి.అవకాశాలకు, ప్రతిభకు ఇక్కడ సంబంధం ఉండదు. ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. అయితే ఇండస్ట్రీలో యువరక్తం నింపేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. వీలైనంతగా కొత్తవారిని ఇండస్ట్రీలోకి తీసుకొస్తూ ప్రోత్సహిస్తున్నాను ’ అని వివేక్‌ వ్యాఖ్యానించారు. కాగా ‘రక్త చరిత్ర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు వివేక్‌ ఓబెరాయ్‌. ఆ తర్వాత రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’లో విలన్‌గానూ మెప్పించాడు.

Also Read:

Samantha on Pushpa Trailer: పుష్ప ట్రైలర్ పై సమంత ఆసక్తికర ట్వీట్.. ఏమన్నదో తెలుసా..

Katrina kaif- Vicky Kaushal: విక్ట్రీనా పెళ్లి ఫుటేజీ కోసం పోటీ పడుతోన్న ప్రముఖ ఓటీటీ !.. రూ. 100 కోట్ల భారీ ఆఫర్‌!

Prabhas: ఏపీ వరద బాధితులకు అండగా ప్రభాస్.. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‏కు రూ. కోటి విరాళం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే