Vikram Vedha: శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విక్రమ్ వేద బాలీవుడ్ రీమేక్..
తమిళ్‌లో మాధవన్- విజయ్ సేతుపతి కలిసి నటించిన విక్రమ్ వేద సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Vikram Vedha: తమిళ్‌లో మాధవన్- విజయ్ సేతుపతి కలిసి నటించిన విక్రమ్ వేద సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది. ఈ రీమేక్ లో ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ కలిసి నటిస్తున్నారు. భూషణ్ కుమార్ టీసీరీస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్, ఎస్.శశికాంత్ వైనాట్ స్టూడియోస్‌తో కలిసి ఈ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ ను నిర్మిస్తున్నాయి. 27 రోజుల ఫస్ట్ షెడ్యూల్‌ని అబుదాబిలో విజయవంతంగా పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. ఈ షెడ్యూల్లో హృతిక్ రోషన్ పాల్గొన్నారు. లక్నోలో జరిగే సెకండ్ షెడ్యూల్‌లో సైఫ్ అలీఖాన్ పాల్గొననున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రాధికా ఆప్టే నటిస్తున్నారు. విక్రమ్‌వేద ఒరిజినల్ సినిమా కథ రాసి దర్శకత్వం వహించిన పుష్కర్, గాయత్రి… ఇప్పుడు హిందీ రీమేక్‌నూ డైరక్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పుష్కర్, గాయత్రి మాట్లాడుతూ..“గొప్ప స్టార్లు హృతిక్, సైఫ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన టీమ్‌తో కలిసి పనిచేస్తున్నాం. అత్యంత ఇంటెన్స్ , ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్ ను డెలివరీ చేస్తామనే నమ్మకం ఉంది“ అని అన్నారు.
విక్రమ్ ఔర్ బీటాల్‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన నియో-నాయర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ఒక పోలీస్.. ఒక గ్యాంగ్‌స్టర్… ఆ గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకోవడానికి పోలీస్ చేసిన ఆసక్తికర ప్రయత్నమే ఈ సినిమా. నాలుగేళ్ల క్రితం తమిళ్‌లో విడుదలైన విక్రమ్ వేద సబ్జెక్ట్ ని, ఇప్పుడు హిందీలో ఇంకా అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. హృతిక్, సైఫ్ లాంటి స్టార్స్ కలిసి నటించంనుండటం తో సినిమా పై ఆసక్తి నెలకొంది. 2022 సెప్టెంబర్ 30న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :