Akhanda Movie: బోయపాటి శ్రీనును కలిసిన తెలంగాణ గౌడ సంఘాలు.. ఇంతకీ విషయమేంటంటే..
Akhanda Movie: బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం 'అఖండ' సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఎక్కడ చూసినా..
Akhanda Movie: బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘అఖండ’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఎక్కడ చూసినా అఖండ విజయోత్సవాలతో సందడి నెలకొంది. కరోనా తర్వాత మూగబోయిన థియేటర్లు బాలకృష్ణ గర్జనతో హోరెత్తాయి. రికార్డుల కలెక్షన్లతో సినిమా దూసుకుపోతోంది. బాలకృష్ణ వన్ మ్యాన్ షోగా నడిచిన సిసిమాకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో చాలా రోజుల తర్వాత థియేటర్లు హౌజ్ ఫుల్ షోలతో నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అఖండ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీనును తెలంగాణ గౌడ సంఘాలు కలిసి సత్కరించాయి. బోయపాటిని గౌడ సంఘాలు కలవడానికి కారణం ఏంటనేగా మీ సందేహం..
వివరాల్లోకి వెళితే.. అఖండ చిత్రంలో బాలకృష్ణ కల్లు తాగుతోన్న సన్నివేశం ఉంటుంది. హీరోయిన్ ప్రగ్యా హీరోతో కల్లు తాగిపిస్తుంది. ఆ సందర్భంగా ప్రగ్యా కల్లు వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ.. ‘కల్లు అనేది మా సంస్కృతిలో ఓ భాగం. ఇది మందు కాదు.. మెడిసిన్. ఇది తీసుకుంటే బాడీ సాఫ్ అయితది, దిమాక్ కూల్ అయితది’ అంటూ చెబుతుంది. ఇలా కల్లు గొప్పతనాన్ని సినిమాలో డైలాగ్ రూపంలో చెప్పించారు కాబట్టే. తెలంగాణ గౌడ సంఘాలు బోయపాటిని సన్మానించాయి. మంగళవారం ఫిలిం నగర్‌లోని ఆయన ఆఫీసులో కలిసి శాలువాలతో సత్కరించారు. అనంతరం పుష్ప గుచ్చాలు అందించి ధన్య వాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులతో పాటు పలువురు పాల్గొన్నారు.
Also Read: Priyanka Jawalkar: అందాలు ఆరబోస్తున్న అందాల తార ప్రియాంక జవాల్కర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
Sreeleela: కవ్విస్తున్న కన్నడ లేత సోయగం శ్రీలీల లేటెస్ట్ పిక్స్
Millionaire Girl: పదేళ్ల వయసులోనే రాజభోగాలు.. చిన్నవయసులోనే కోటీశ్వరురాలైన చిన్నారి..!