Allu Arha: చిట్టి చేతులతో వాల్ క్లైంబింగ్ చేస్తున్న అల్లు అర్జున్ గారాలపట్టి.. వైరల్ అవుతున్న వీడియో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీకి మాత్రమే కాదు ఆయన గారాల పట్టి అల్లు అర్హ కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీకి మాత్రమే కాదు ఆయన గారాల పట్టి అల్లు అర్హ కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ చిన్నారి చేసే అల్లరి.. ముద్దు ముద్దు మాటలు ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు అల్లు దంపతులు. ఇక ఈ చిన్నది సోషల్ మీడియా స్టార్ అనే చెప్పాలి. అర్హ కు సంబంధించిన ఏ చిన్న పోస్ట్ అయినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ వీడియో చక్కర్లు కొడుతుంది.
అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ తాజాగా సోషల్ మీడియాలో మరో సారి వైరల్ అవుతోంది. తన చిట్టి చేతులతో.. వాల్ క్లైంబింగ్ చేస్తూ అందర్నీ షాక్ చేస్తోంది. షాక్ చేయడమే కాదు వావ్ అర్హా అని అందరి చేత అనిపించుకుంటుంది. చిన్నప్పటి నుంచే తన క్యూట్ లుక్స్‌తో.. అడారబుల్ అల్లరితో అందర్నీ ఫిదా చేసిన అర్హా.. టాలీవుడ్‌లో స్టార్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తన తల్లి స్నేహ షేర్ చేసే వీడియోలతో అందరికి చేరువైంది. అయితే తాజాగా డ్రీమ్ బిగ్ లిటిల్ వన్ అనే క్యాప్షెన్‌తో అల్లు వైఫ్ స్నేహ ఈ వీడియోను షేర్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ చిన్నారి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న శాకుంతలం సినిమాలో చిన్న పాత్రలో కనిపించనుంది.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :