Balakrishna: ఆఫ్టర్ కరోనా.. అఖండ మూవీ సక్సెస్‌తో మాంచి దూకుడు మీదున్నాడు బాలయ్య. సింహం షికారుకు చేస్తున్నట్టు.. పులి వేటాడినట్టు బాక్సాఫీస్ కలెక్షన్లను చీల్చి చండాడుతున్నాడు. థియేటర్లుకు జనాలను రప్పిస్తూ.. ఇండస్ట్రీలో చక్రం తిప్పేస్తున్నారు. అటు సినమాలే కాకుండా.. ఇటు ఓటీటీలో టాక్ షోను పరుగెత్తిస్తూ.. అన్‌స్టాపబుల్ బాలయ్య గా అందరి చేత పిలించుకుంటున్నాడు. అయితే తాజాగా విలన్ కూడా యాక్ట్ చేస్తా అంటూ చెప్పేసి.. టాలీవుడ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారాడు ఈ యాంగ్రీ హీరో. హీరోగా కొండంత ఎత్తులో ఉన్న బాలయ్య.. తాజాగా విలన్ గా కూడా చేస్తానంటూ అన్‌స్టాపబుల్ షో వేదికగా అనౌన్స్ చేశారు. రీసెంట్ జరిగిన అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో శ్రీకాంత్, ప్రగ్యా, బోయపాటి ముందు ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు బాలయ్య. ఎవరైన డైరెక్ట్ చేయడానికి రెడీ గా ఉంటే.. విలన్ క్యారెక్టరైనా తనకు ఓకే అన్నారు. అయితే హీరోగా కూడా తనే నటిస్తానంటూ చివర్లో మరో పంచ్ ఇచ్చి.. బోయపాటి, శ్రీకాంత్‌ను షాక్ అయ్యేలా చేశారు.
ఇలా అన్‌స్టాపబుల్ షోను హిలయరెస్‌గా మారుస్తున్నారు బాలయ్య. తన మాటలు, చమత్కారాలు, ఫన్నీ మూవ్స్‌తో షో వచ్చిన గెస్టులను ఆకట్టుకుంటున్నారు. షో చూసే వారిలో నవ్వులు పూయిస్తున్నారు. హోస్టింగ్‌లోనూ స్టార్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. ఇక బాలయ్య ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమా కోసం రెడీ అవుతున్నాడు. గోపీచంద్ మలినేని బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ ని రెడీ చేశాడని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :