Viral Video: ఒకే చోట ఇద్దరు క్రికెట్ లెజెండ్స్.. వైరల్‌గా మారిన వీడియో..
ఇద్దరు క్రికెట్ లెజెండ్స్ ఒకే చోట కనిపిస్తే ఎలా ఉంటుంది. వారి ఫ్యాన్స్ కు పండుగే అవుతుంది. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ అందించిన ఆ ఇద్దరు ఆటగాళ్లంటే మరింత క్రేజ్ ఉంటుంది...

ఇద్దరు క్రికెట్ లెజెండ్స్ ఒకే చోట కనిపిస్తే ఎలా ఉంటుంది. వారి ఫ్యాన్స్ కు పండుగే అవుతుంది. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ అందించిన ఆ ఇద్దరు ఆటగాళ్లంటే మరింత క్రేజ్ ఉంటుంది. వారిద్దరు ఎవరో కాదు యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ. వీరిద్దరు ఇటీవల ఒక యాడ్ షూట్‌లో కలుసుకున్నారు. పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. ఒకరికొకరు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెంట్టిట్లో వైరల్‌గా మారింది. వీరిద్దరూ 2007లో ప్రారంభ ICC T20 ప్రపంచ కప్ విజేతగా ఇండియాను నిలబెట్టారు. నాలుగు సంవత్సరాల తర్వాత, వారు మళ్లీ కలిసి సొంతగడ్డపై 50 ఓవర్ల ప్రపంచ కప్‌ను గెలిచేందుకు సహకరించారు.
MS ధోని నేతృత్వంలో యువరాజ్ 104 వన్డేలు ఆడాడు. ఆరు సెంచరీలతో 3077 పరుగులు చేశాడు. 88.21 స్ట్రైక్ రేట్‌తో 21 అర్ధ సెంచరీలు చేశాడు. యువరాజ్ సింగ్, MS ధోని మధ్య భాగస్వామ్యాలు ఎల్లప్పుడూ చూడటానికి అద్భుతంగా ఉన్నాయి. అయితే వారికి గతంలో చేదు అనుభావాలు ఉన్నాయి. యువరాజ్ తండ్రి జోగ్‌రాజ్ ధోనీని విమర్శించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి యువరాజ్‌ని తొలగించడం వెనుక ధోనీ హస్తం ఉందని యువరాజ్ తండ్రి పదే పదే ఆరోపించారు. CSK ధోనీని కొనసాగించినందున IPL-2022లో ధోనీ మైదానంలో కనిపిస్తాడు. మరోవైపు యువరాజ్ ఇండియా లెజెండ్స్ కోసం రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొంటాడు.
Yuvraj Singh’s latest Instagram story:#Yuvi #MSD pic.twitter.com/FdCWaR2tkF
— StumpMic Cricket (@stumpmic_) December 6, 2021
Read Also.. IND vs NZ: మ్యాచ్ ఆడకుండా ఒక్క క్యాచ్‌తో హీరో అయ్యాడు.. అద్భుతమైన ఫిల్డింగ్ చేసిన ఆ ఆటగాడు ఎవరంటే..