Train Theft: నకిలీ ఆధార్ కార్డులతో రైలు ప్రయాణం.. రూ. లక్షలు విలువ చేసే బంగారం చోరీ.. చివరికి ఏమైందంటే..

Train Theft: నకిలీ ఆధార్‌ కార్డులతో ఏసీ కాంపార్ట్‌మెంట్‌లో రైలు టికెట్‌ బుస్‌ చేసుకోవడం, తీరా మార్గ మధ్యంలో ప్రయాణికుల వద్ద ఉన్న విలువైన ఆభరణాలు కొట్టేస్తూ రూ. లక్షలు దోచేస్తోన్న ఓ కీలాడిని..

Train Theft: నకిలీ ఆధార్ కార్డులతో రైలు ప్రయాణం.. రూ. లక్షలు విలువ చేసే బంగారం చోరీ.. చివరికి ఏమైందంటే..
Follow us

|

Updated on: Dec 07, 2021 | 8:58 PM

Train Theft: నకిలీ ఆధార్‌ కార్డులతో ఏసీ కాంపార్ట్‌మెంట్‌లో రైలు టికెట్‌ బుస్‌ చేసుకోవడం, తీరా మార్గ మధ్యంలో ప్రయాణికుల వద్ద ఉన్న విలువైన ఆభరణాలు కొట్టేస్తూ రూ. లక్షలు దోచేస్తోన్న ఓ కీలాడిని అనంతపురం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. విలాసాలకు అలవాటుపడ్డ హైదరాబాద్‌లోని మలక్ పేటకు చెందిన ఉమేద్ అలి పక్కా ప్రణాళికతో రైల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడేవాడు. ఇలా ప్రయాణిస్తూ దొంగతనాలకు పాల్పడినప్పుడు తన సమాచారం పోలీసులకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. అందుకుగాను ప్రయాణం చేసిన ప్రతీసారి నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి ఆ పేరుతోనే రైలులో ప్రయాణం చేస్తూ చోరీలకు పాల్పడేవాడు.

Theft

 

దీంతో రైళ్లలో జరుగుతున్న దొంగతనాలు నివారించడం కోసం గుంతకల్ రైల్వే డివిజన్ ఎస్పి అనిల్ బాబు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే పక్కా సమాచారంతో గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో ఉమేద్ అలిని అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి 30 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఒక మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి గుంతకల్ జీఆర్‌పీ ఎస్పీ అనిల్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఏసీ కోచ్‌లో ప్రయాణం చేస్తూ ప్రయాణికుల దగ్గర ఆభరణాలు దొంగతనాలకు పాల్పడే వాడు. అలాగే బ్యాగులు చోరీ చేయడం, కిటికీలో ప్రక్కన నిద్రపోతున్న ప్రయాణికులను మెడలోని బంగారు ఆభరణాలు లాక్కెళ్లడం చేస్తూ వచ్చాడు.

Theft Ap

గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని గుంతకల్లు, గుత్తి, నంద్యాల, ధర్మవరం, హిందూపురం, కదిరి, కావలి, నెల్లూరు, రేణిగుంట కాచిగూడలో గత మూడేళ్ల నుంచి ఏకంగా చోరీకేసులో మొత్తం 628 గ్రాముల బంగారు దోపిడీకి పాల్పడ్డాడని, ప్రత్యేక పోలీస్ బృందం చాకచక్యంగా అరెస్ట్ చేసి ఈ మొత్తం సొమ్మును రికవరీ చేసిందని అనిల్‌ బాబు తెలిపారు.

లక్ష్మీ కాంత్‌, టీవీ9 తెలుగు, అనంతపురం జిల్లా.

Also Read: Burundi prison fire: నైరోబి జైలులో భారీ అగ్ని ప్రమాదం.. 38మంది ఖైదీల సజీవదహనం.. 69మందికి గాయాలు!

Sreemukhi: క్రేజీ స్టిల్స్‌తో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్న బబ్లీ బ్యూటీ

Unstoppable with NBK : బాలయ్య షోకు మరో బడా‌ హీరో.. అన్ స్టాపబుల్‌లో సందడి చేయడానికి రెడీ అవుతున్న స్టార్ హీరో..