IND vs NZ: మ్యాచ్ ఆడకుండా ఒక్క క్యాచ్‌తో హీరో అయ్యాడు.. అద్భుతమైన ఫిల్డింగ్ చేసిన ఆ ఆటగాడు ఎవరంటే..
టీమిండియా- కివీస్ టెస్టు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే మిచెల్ సాంట్నర్ హీరో అయ్యారు. కేవలం సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా గ్రౌండ్‌లోకి ఎంటరైన..
IND vs NZ: టీమిండియా- కివీస్ టెస్టు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే మిచెల్ సాంట్నర్ హీరో అయ్యారు. కేవలం సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా గ్రౌండ్‌లోకి ఎంటరైన ఈ ప్లేయర్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్ వీక్షకులను ఆకట్టుకున్నాడు.సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మాత్రమే జట్టుకు సేవలందించిన సాంట్నర్ అయ్యర్ కొట్టిన భారీషాట్‌ను సిక్స్ పోకుండా అడ్డుకున్నాడు. తమ జట్టుకు అదనపు పరుగులు కోల్పోకుండా మెరుపు ఫీల్డింగ్ చేశాడు. ఇక ఈ వీల్డింగ్‌కు కారణంగానే ”బెస్ట్ సేవ్ ఆఫ్ ది మ్యాచ్” కింద రూ.లక్ష ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు సాంట్నర్. అంతే కాదు అంతకు విలువైన వీక్షకుల మనసు గెలుచుకున్నాడు.
ఇక రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మయాంక్ అగర్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా అక్కడి గడ్డపై 3 టెస్టులు.. 3 వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 26 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :