27 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. 7గురి బౌలర్ల భరతం పట్టాడు.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా!

27 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. 7గురి బౌలర్ల భరతం పట్టాడు.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా!
Salt

లంక ప్రీమియర్ లీగ్‌లో 25 ఏళ్ల ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ చిన్న సైజ్ విధ్వంసాన్ని సృష్టించాడు. 7గురి బౌలర్లను సిక్సర్లు, ఫోర్లతో ఉతికరేశాడు...

Ravi Kiran

|

Dec 07, 2021 | 7:08 PM

లంక ప్రీమియర్ లీగ్‌లో 25 ఏళ్ల ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ చిన్న సైజ్ విధ్వంసాన్ని సృష్టించాడు. 7గురి బౌలర్లను సిక్సర్లు, ఫోర్లతో ఉతికరేశాడు. తన ఇన్నింగ్స్‌లో 27 బంతులు ఆడిన ఈ బ్యాట్స్‌మెన్.. క్షణాల్లో మ్యాచ్‌ను తన సైడ్‌కు మార్చుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ దంబుల్లా జెయింట్స్, క్యాండీ వారియర్స్ మధ్య జరిగింది. ఆ విధ్వంసం సృష్టించిన బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్.

ఈ మ్యాచ్‌లో దంబుల్లా జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్ నిరోషమ్ డిక్వెల్లాతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఫిల్ సాల్ట్.. వచ్చీరాగానే బౌండరీలతో హోరెత్తించాడు. 27 బంతుల్లో సూపర్ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. అలాగే డిక్వెల్లా 23 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇక చివరిగా లోయర్ ఆర్డర్‌లో రమేష్ మెండిస్ ఫినిషింగ్ టచ్‌ ఇవ్వడంతో దంబుల్లా జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది.

5 సిక్సర్లు, 4 ఫోర్లతో ఫిల్ సాల్ట్ తుఫాన్ ఇన్నింగ్స్..

ఈ మ్యాచ్‌లో 25 ఏళ్ల ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్ 27 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 238 స్ట్రైక్ రేట్‌తో 64 పరుగులు చేశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో అతడు బౌండరీల రూపంలోనే 46 పరుగులు చేశాడు. సాల్ట్‌ను కట్టడి చేసేందుకు కాండీ వారియర్స్ 7గురి బౌలర్లను ప్రయత్నించి విఫలమైంది. అటు లోయర్ ఆర్డర్‌లో రమేష్ మెండిస్ 200 స్ట్రైక్ రేట్‌తో 11 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్‌తో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

క్యాండీ వారియర్స్‌కి తృటిలో తప్పిన విజయం..

దంబుల్లా జెయింట్స్ విధించిన 191 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో క్యాండీ వారియర్స్‌ 20 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఫిల్ సాల్ట్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu