Payal Rajput: పాయల్ రాజ్‏పుత్‏ను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్..

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్ని

Payal Rajput: పాయల్ రాజ్‏పుత్‏ను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్..
Payal Rajput
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 08, 2021 | 7:56 AM

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టేసింది పంజాబీ ముద్దుగుమ్మ. బోల్డ్ కంటెంట్‏తో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అయినా.. ఈ పంజాబీ భామాకు తెలుగులో మాత్రం ఆశించనంతగా ఆఫర్లు రాలేదు. రవి తేజ, వెంకటేష్ లాంటి హీరోలతో స్కీన్ షేర్ చేసుకుంది ఈ చిన్నది. ఇటు హీరోయిన్‏గానే కాకుండా.. స్పెషల్ సాంగ్స్‏లోనూ అలరిస్తుంది పాయల్. అయితే ఓ వైపు వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది పాయల్ రాజ్ పుత్.

ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఇటీవల పాయల్ చేసిన ఓ ఫోటోషూట్ వీడియో నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. బోల్డ్ ఫోటో షూట్ చేసి ఆ వీడియోను బి హైండ్ ది సీన్స్ అంటూ షేర్ చేసింది. అయితే ఆ వీడియో అత్యంత అసభ్యకరంగా ఉండడంతో వెంటనే తెరుకుని డెలీట్ చేసింది పాయల్. అయితే అప్పటికే ఆ వీడియోను డౌన్ లోడ్ చేసి నెట్టింట్లో షేర్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు నెటిజన్స్. ఈ క్రమంలో తనను ట్రోల్ చేస్తున్న విమర్శకులను నిందిస్తూ.. ఇతర మహిళల వద్ద ఉన్నదే నా దగ్గర ఉంది. వారి వద్ద లేనిది కొత్తగా నా వద్ద ఏం లేదు అంటూ బోల్డ్ కౌంటర్ ఇచ్చింది. అలాగే ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి టార్గెట్ చేయడం మానుకోవాలని విమర్శకులను కోరింది. పనిలేని వాళ్లు ఆన్ లైన్లో వీడియోను మార్ఫింగ్ చేసి దానిని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించింది.

Also Read: Singer Chinmayi: చిన్మయికి మద్దతు తెలిపిన ఆ ఇద్దరూ.. స్క్రీన్ షాట్స్ బయటపెట్టిన సింగర్..

Shriya Saran: నా ఈ 20 ఏళ్ల ప్రయాణానికి అదే కారణం.. సినీ, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీయ..