AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Chinmayi: చిన్మయికి మద్దతు తెలిపిన ఆ ఇద్దరూ.. స్క్రీన్ షాట్స్ బయటపెట్టిన సింగర్..

సింగర్ చిన్మయి.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో అమ్మాయిలు

Singer Chinmayi: చిన్మయికి మద్దతు తెలిపిన ఆ ఇద్దరూ.. స్క్రీన్ షాట్స్ బయటపెట్టిన సింగర్..
Chinmayi
Rajitha Chanti
|

Updated on: Dec 08, 2021 | 7:35 AM

Share

సింగర్ చిన్మయి.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎదుర్కోంటున్న వేధింపులు.. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు.. అమ్మాయిల వివాహం.. కట్నం వంటి అంశాలపై తనదైన శైలీలో స్పందిస్తుంటుంది సింగర్ చిన్మయి. అలాగే ఎంతో మంది అమ్మాయిలు తమ బాధలను సోషల్ మీడియా ద్వారా చిన్మయికి చెప్పు.. సలహాలు తీసుకుంటుంటారు. ఇటీవల అమ్మాయిల వివాహం.. కట్నం ఇవ్వడం వంటి అంశాలపై సింగర్ చిన్మయి వరుస పోస్ట్స్ చేసింది.

అమ్మాయిలకు ఇష్టంలేకపోయిన సొంత క్యాస్ట్‏లో వెధవనైనా సరే ఇచ్చి పెళ్లి చేస్తారని.. మహిళలను ఆర్థికంగా.. స్వేచ్చగా బతుకనివ్వరు అంటూ సంచలన కామెంట్స్ చేసింది చిన్మయి. ఎన్నారైలకు కోట్లకు కోట్లు కట్నాలు ఇస్తారు అంటూ చిన్మయి చేసిన పోస్ట్‏కు కొందరు నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేశారు. అయితే అందరూ ఎన్నారైలంతా కూడా అలాంటి వారేనా ? అంటూ కామెంట్స్ చేయగా.. వారికి కౌంటర్స్ వేసింది చిన్మయి. అయితే ఇదే విషయంపై ఇద్దరు ఎన్నారైలు చిన్మయికి మద్దతుగా నిలిచారట. ఈ విషయాన్ని స్వయంగా సింగర్ బయటపెట్టింది.

ఇద్దరూ ఎన్నారైలు తనకు చేసిన మేసేజ్‏లను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది చిన్మయి. మీరు చెప్పినట్టుగానే చాలా మంది ఎన్నారైలు ప్రవర్తిస్తున్నారు. మీ మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ వాటిని పట్టించుకోకండి.. మీరు సరైన దారిలో వెళ్తున్నారు. అమ్మాయిలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇది చాలా మంచి పని. మీ మాట విని ఒక్కరు మారిన చాలు.. అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడినా చాలు అంటూ చిన్మయికి మద్దతు నిలిచారు. నిజమైన మనుషులు, మగవారికి నా పోస్టులతో ఎలాంటి బాధ ఉండదు. వారికి ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఓ అమ్మాయి నో చెబితె తట్టుకోలేని వాళ్లు.. వాళ్ల ఆధిపత్యం ఎక్కడ పోతుందో అని భయపడేవాళ్లు ఇలా చేస్తారు. తనకు మద్దతుగా నిలిచిన వారు గోల్డ్ అంటూ కామెంట్ చేసింది చిన్మయి.

Also Read: Shriya Saran: నా ఈ 20 ఏళ్ల ప్రయాణానికి అదే కారణం.. సినీ, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీయా..

Vikranth Rona: కిచ్చా సుదీప్ 3 డీ మూవీ విక్రాంత్ రోణ‌.. రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రయూనిట్..

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!