AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: అలియా భట్ సీతగా ఎలా మారిందో చూశారా ?.. ఆర్ఆర్ఆర్ నుంచి మేకింగ్ వీడియో..

రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Alia Bhatt: అలియా భట్ సీతగా ఎలా మారిందో చూశారా ?.. ఆర్ఆర్ఆర్ నుంచి మేకింగ్ వీడియో..
Aliaa Bhatt
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 08, 2021 | 12:10 PM

రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. స్టార్ హీరోస్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరిని ఒకే స్క్రీన్ పై చూసేందుకు మెగా, నందమూరి అభిమానులు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు నటిస్తుండడంతో ఆర్ఆర్ఆర్ పై హైప్ ఎక్కువగానే ఉంది. ఈక్రమంలో ఇప్పటికే ఈమూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ నెట్టింట్లో సంచలనం సృష్టించాయి. ఇక ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రేక్షకుల నిరీక్షణకు స్వస్తి పలుకుతూ రేపు ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల కాబోతుంది.

అయితే ట్రైలర్ రిలీజ్ చేయబోతుండడమే కాకుండా.. ప్రతిరోజూ ఆర్ఆర్ఆర్ నుంచి అప్డేట్స్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. నిన్న తారక్, చరణ్ పాత్రలకు సంబంధించిన పోస్టర్స్, మోషన్ వీడియోస్ విడుదల చేసి ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చింది చిత్రయూనిట్. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని సీత పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది మూవీ టీం. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఇందులో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన సీత పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజా వీడియోలో అలియా నుంచి సీతగా మారే క్రమాన్ని చూపించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా.. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళితో చర్చలు జరపడం దగ్గర నుంచి సీత పాత్రలో ఒదిగిపోయే వరకు చూపించారు. ఇందులో పదహారణాల తెలుగమ్మాయిగా అలియా ఆకట్టుకుంటుంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని సమాచారం. అలియాది.. ఇద్దరు మహావీరుల మధ్య ఆమె రిలీఫ్ అని సీత పాత్ర ప్రేక్షకుల మనసులు దోచుకుంటుందని.. రామారాజు.. భీమ్ ల మధ్య ఆమె ఒక కనెక్టింగ్ అంశమని ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలియా మేకింగ్ వీడియో…

View this post on Instagram

A post shared by RRR Movie (@rrrmovie)

Also Read: Vijay Sethupati: విజయ్ సేతుపతి పై క్రిమినల్ కేసు.. ఎయిర్ పోర్టు ఘటనలో హీరోకు బిగుస్తున్న ఉచ్చు..

Bigg Boss 5 Telugu: పర్ఫామెన్స్‎తో రెచ్చిపోయిన సన్నీ.. హగ్గులతో షణ్ముఖ్ పరువు తీశాడుగా..

AR Rahman: నా కూతుర్లకు నేను ఇచ్చే సలహా అదే.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఏఆర్ రెహమాన్..