Bigg Boss 5 Telugu: పర్ఫామెన్స్‎తో రెచ్చిపోయిన సన్నీ.. హగ్గులతో షణ్ముఖ్ పరువు తీశాడుగా..

బిగ్‏బాస్ సీజన్ 5 బుధవారం నాటి ఎపిసోడ్‏లో ఇంటి సభ్యులకు సూపర్ లగ్జరీ ఐటమ్స్ టాస్క్ ఇచ్చాడు. లగ్జరీ ఐటమ్స్ కోసం

Bigg Boss 5 Telugu: పర్ఫామెన్స్‎తో రెచ్చిపోయిన సన్నీ.. హగ్గులతో షణ్ముఖ్ పరువు తీశాడుగా..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 08, 2021 | 10:39 AM

బిగ్‏బాస్ సీజన్ 5 బుధవారం నాటి ఎపిసోడ్‏లో ఇంటి సభ్యులకు సూపర్ లగ్జరీ ఐటమ్స్ టాస్క్ ఇచ్చాడు. లగ్జరీ ఐటమ్స్ కోసం గులాబ్ జామ్ టాస్క్ ఇచ్చాు ఐకానిక్ పాత్రలను ప్లే చేయాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. ఇందులో సిరి గెలిచి ఫ్రైడ్ చికెన్ ఐటమ్ గెలుచుకుంది. ఇక ఆ తర్వాత ప్రేక్షకులకు నచ్చిన ఐకానిక్ సంఘటనల్ని వేరేవారు ప్లే చేయాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన వారికి ఓటింగ్ బూత్ నుంచి ఆడియన్స్ కు ఓటింగ్ కోసం అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో సన్నీ, సిరిల మధ్య జరిగిన అప్పడం వివాదాన్ని ఇమిటేట్ చేసి చూపించాలని ఆదేశించాడు. ఇందులో సన్నీ.. షణ్ముఖ్ మాదిరిగా.. సిరిగా షణ్ముఖ్, సన్నీలా షణ్ముఖ్, కాజల్ మాదిరిగా శ్రీరామ్, యానీ మాస్టర్ లా మానస్, రవిలా కాజల్ నటించారు.

అయితే షణ్ముఖ్ పాత్ర చేసిన సన్నీ అదరగొట్టాడు. సిరి పాత్రలో ఉన్న షణ్ముఖ్‏ని ప్రతిసారి హగ్ చేసుకున్నాడు. ప్రతి చిన్నదానికి హగ్ చేసుకుంటూ.. ఆంటీ ఇది ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ రోజు షణ్ముఖ్, సిరిలు ఎలాగైతే చేస్తారో అలా చేస్తూ వారి పరువు తీసినంత పనిచేశాడు. దీంతో హర్ట్ అయిన షణ్ముఖ్.. ఇది వేరే విధంగా వెళ్తుంది. నువ్ బాగా ఓవర్ చేస్తున్నావ్ అంటూ సీరియస్ అయ్యాడు. దీంతో సన్నీ తగ్గిడంతో షణ్ముఖ్ కాస్త కూల్ అయ్యాడు. మొత్తానికి గేమ్ చేసినట్టుగా చేస్తూనే షణ్ముఖ్, సిరిలకు ఇచ్చిపడేశాడు సన్నీ.

ఇక టాస్క్ అనంతరం మళ్లీ సన్నీ దగ్గరకు వచ్చిన షణ్ముఖ్.. నాకు ఇమిటేట్ చేస్తే అస్సలు నచ్చదు.. ఇమిటేషన్ వేరు.. వెకిలించడం వేరు.. నువ్ చేసినట్టుగా వేరేవాళ్లు నీ గురించి చేస్తే బాధ తెలుస్తుంది. నెక్ట్స్ టైం ఇలా చేయకు అంటూ షణ్ముఖ్ వార్నింగ్ ఇచ్చాడు..దీంతో కామెడీగా చేశాను అని సన్నీ చెప్పాను. అయితే పక్కనే ఉన్న సిరి కల్పించుకుని సర్లే అయిపోయిందిగా వదిలేయంటూ సలహా ఇచ్చింది.

Also Read: AR Rahman: నా కూతుర్లకు నేను ఇచ్చే సలహా అదే.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఏఆర్ రెహమాన్..