Andhra Pradesh: కలుషిత నీరు తాగడంతో విజృంభిస్తోన్న అతిసార.. ముగ్గురు మృతి.. 60 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స..
Andhra pradesh News: శీతాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో తినే తిండి నుంచి తాగే నీటి వరకూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..
Andhra pradesh News: శీతాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో తినే తిండి నుంచి తాగే నీటి వరకూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి వీడి ఆహారంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలి. లేదంటే వ్యాధుల బారిన పడతారు. తాజాగా చిత్తూరు జిల్లాలో కలుషిత నీరు తాగడంతో అనేక మంది అతిసారకు గురయ్యారు. గంగాధర నెల్లూరు మండలం కడపగుంటలో అతిసార విజృంభిస్తోంది. ఇక్కడ వాంతులు విరేచనాలతో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు.
15 రోజులల్లో 60 మందికి పైగా ఆసుపత్రి పాలు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో ప్రస్తుతం ఐదుగురు, చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే, ఈ వ్యాధికి కారణం కలుషిత నీరేనని, అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. తాగునీరు కలుషితం, పరిసరాలు అపరిశుభ్రతే కారణమంటున్నారు వైద్యులు. దీనిపై దృష్టిపెట్టి తమను రక్షించాలని వేడుకుంటున్నారు ప్రజలు.
ఆశ, ANM, వాలంటీర్, డాక్టర్లు సమన్వయంతో చర్యలు చేపట్టాలని గతంలోనే ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. ఇటీవల కర్నూలు జిల్లాలో అతిసారం ప్రబలినప్పుడు, ప్రతి 100 కుటుంబాలకు ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు అధికారులు. కడపగుంటలో కూడా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రజలు.
Also Read: తెలుగు అమర జవాన్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా… ఇరు రాష్ట్రాల సీఎంలపై వీహెచ్ తీవ్ర విమర్శలు..