Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamata Banerjee: బీజేపీని ఓడించాలంటే ఎవరైన మాకు మద్దతు ఇవ్వాల్సిందే.. గోవాలో బెంగాల్ దీదీ కీలక వ్యాఖ్యలు!

Goa Assembly Elections 2022: జాతీయ రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా మారారు దీదీ. దేశవ్యాప్తంగా తృణమూల్‌ను విస్తరించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

Mamata Banerjee: బీజేపీని ఓడించాలంటే ఎవరైన మాకు మద్దతు ఇవ్వాల్సిందే.. గోవాలో బెంగాల్ దీదీ కీలక వ్యాఖ్యలు!
Mamata Banerjee
Follow us
Balaraju Goud

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:28 PM

Mamata on Goa Assembly Elections 2022: జాతీయ రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా మారారు దీదీ. దేశవ్యాప్తంగా తృణమూల్‌ను విస్తరించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తాజాగా గోవాపై ఫోకస్‌ పెట్టారు మమత. రెండు రోజుల గోవా పర్యటనలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ, రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కోస్తా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఓడించి, తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. “ఎవరైనా బిజెపిని ఓడించాలనుకుంటే, మాకు మద్దతు ఇవ్వడం వారి ఇష్టం” అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అన్నారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ను జాతీయ పార్టీగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు మమత. అందులో భాగంగానే గోవాపై కన్నేశారు బెంగాల్‌ సీఎం. గోవాలో ఇటీవలి కాలంలో మమత పర్యటించడం ఇది రెండోసారి. గోవాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు దీదీ. గోవా ఇంటర్నేషనల్ సెంటర్‌లో అక్కడి టీఎంసీ నేతలతో సమావేశమై, ఎన్నికల వ్యూహాన్ని రచించారు మమత. ఫిబ్రవరిలో జరగనున్న గోవా ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేస్తుందని ప్రకటించారు మమతా బెనర్జీ. గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ ఐదు వాగ్దానాలను ప్లాన్ చేసింది. ఇప్పటివరకు మూడు వాగ్దానాలు ప్రకటించింది.

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని ఇదివరకే ప్రకటించింది తృణమూల్ కాంగ్రెస్. ఈ పథకం కింద గోవా మహిళలకు నెలకు 5 వేలు అందిస్తామన్నారు నేతలు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ అధికారంలోకి వస్తే, ప్రతి కుటుంబంలోని మహిళలకు డబ్బులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు టిఎంసిపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర మాజీమంత్రి చిదంబరం టిఎంసిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటు అరవింద్ కేజ్రీవాల్ కూడా కీలక ప్రకటన చేశారు. గోవాలో టీఎంసీ, ఆప్ మధ్య ఎలాంటి ఒప్పందం ఉండబోదని స్పష్టం చేశారు కేజ్రీవాల్. గోవా ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారాయన. ఇదిలా ఉంటే, ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది టీఎంసీ. గోమంతక్ పార్టీతో పొత్తు పెట్టుకుంది తృణమూల్‌ కాంగ్రెస్.

గోవాలో తమ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది రాష్ట్రాన్ని నియంత్రించడానికి, ముఖ్యమంత్రి కావడానికి కాదని, ఎన్నికలలో గోవా ప్రజలకు సహాయం చేయడానికి వారి అనుభవాన్ని ఉపయోగించాలని అన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీకి ఎన్నికల కోసం TMC ఇప్పటికే రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP)తో పొత్తు పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్‌లో తాను ఎలా ప్లాన్ చేశారో అదే విధంగా గోవా కోసం తన వద్ద ఒక ప్రణాళిక ఉందని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో తీరప్రాంత రాష్ట్రంలో అమలు చేస్తామని మమతా చెప్పారు. గతంలో తమ పార్టీ గోవాలో పోటీ చేయాలని భావించలేదని, అయితే ఇతర పార్టీలు బిజెపికి పోటీ ఇవ్వడం లేదని గ్రహించిన తర్వాత, టిఎంసి ఇక్కడ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకుందని దీదీ స్పష్టం చేశారు.