December 31: ఈ నెలలో పూర్తి చేయాల్సిన 4 ముఖ్యమైన పనులు.. లేదంటే ఇబ్బందులు తప్పవు.. అవేంటంటే?
సంవత్సరం చివరి నెలలో అంటే డిసెంబర్‌లో మీరు చాలా ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయకుంటే, డిసెంబర్ 31లోగా..
సంవత్సరం చివరి నెలలో అంటే డిసెంబర్‌లో మీరు చాలా ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయకుంటే, డిసెంబర్ 31లోగా చేయండి. అదే సమయంలో, ఈ నెలాఖరులోగా నామినీలను జోడించాలని పీఎఫ్ ఖాతాదారులను ఈపీఎఫ్‌ఓ కోరింది. ఈ నెలలో మీరు చేయవలసిన 4 కీలకమైన పనులేంటో ఓసారి చూద్దాం.
ఇన్‌కం టాక్స్ రిటర్న్ .. ఆదాయపు పన్ను రటర్న్ (ఐటీఆర్) ఆర్థిక సంవత్సరం 2020-21 కోసం 31 డిసెంబర్ వరకు దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఐటీఆర్‌ని సకాలంలో ఫైల్ చేయడం వల్ల పెనాల్టీల నుంచి మిమ్మల్ని రక్షించడమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నిర్ణీత తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయనందుకు మీరు పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. అంతే కాకుండా నోటీసులు వస్తాయోమనని భయపడాల్సి ఉంటుంది. అందుకే డిసెంబర్ 31లోపు ఇన్‌కం టాక్స్ రిటర్న్ దాఖలు చేయాలి.
పీఎఫ్ ఖాతాదారులు నామినీని జోడించాలి.. ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతాదారులందరినీ నామినీని జోడించమని కోరింది. నామినీలను జోడించడానికి 31 డిసెంబర్ 2021ని గడువుగా నిర్ణయించింది. మీరు డిసెంబర్ 31లోగా మీ పీఎఫ్ ఖాతాకు నామినీని జోడించకపోతే, మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. EPFO సైట్‌ని సందర్శించి నామినీని యాడ్ చేయాలి.
ఒక ఈపీఎఫ్ సభ్యుడు మరణించిన సందర్భంలో పీఎఫ్ డబ్బు, ఉద్యోగి పెన్షన్ పథకం (EPS), ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) ప్రయోజనాలను సులభంగా పొందడంలో నామినేషన్ చేయడం సహాయపడుతుంది. ఇది నామినీని ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌లను ఫైల్ చేయడానికి కూడా అనుమతిస్తుంది.
తక్కువ వడ్డీకే గృహ రుణం.. బ్యాంక్ ఆఫ్ బరోడా పండుగ సీజన్‌లో గృహ రుణ వడ్డీ రేటును 6.50%కి తగ్గించింది. కొత్త రుణం కాకుండా, ఇతర బ్యాంకుల నుంచి బదిలీ చేసే గృహ రుణాలపై కూడా కొత్త వడ్డీ రేటు ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ప్రయోజనం డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే, మీరు డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేయడం ద్వారా ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.
ఆడిట్ నివేదికను దాఖలు చేయడం.. వార్షిక ఆదాయం రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉన్న వ్యాపారంతో అనుబంధం ఉన్న వ్యక్తులు, వారు ఆదాయపు పన్ను రిటర్న్‌తో పాటు ఆడిట్ నివేదికను దాఖలు చేయాలి. ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు, డాక్టర్లు, సినీ నటులు, లాయర్లు, టెక్నీషియన్లు వంటి నిపుణులు రూ. 50 లక్షలకు మించిన ఆదాయంపై మాత్రమే ఆడిట్ రిపోర్టులు దాఖలు చేయాల్సి ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ దాఖలు చేయడానికి గడువు కూడా డిసెంబర్ 31వరకే ఉంది.