Indian Railways: ఏసీ కోచ్‌లు రైలు మధ్యలో.. అదే జనరల్ బోగీలు ముందు లేదా వెనకాల.. కారణం ఏంటో తెలుసా..?
Indian Railways: రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వే అతి పెద్దది. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. ప్రయాణికులకు
Indian Railways: రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వే అతి పెద్దది. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. ప్రయాణికులకు కావలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తుంది. తక్కువ ఛార్జీలతో ఎక్కువ దూరం ప్రయాణించేలా చేస్తుంది. అయితే రైల్వేకి ప్రత్యేక నియమాలు, నిబంధనలు ఉంటాయి. ఒక్కోసారి వాటి గురించి తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహారణకు రైలులో ఏసీబోగీలు మధ్యలో ఉంటాయి. అదే జనరల్ బోగీలు ముందు లేదా వెనకాల ఉంటాయి. దీనికి కారణం ఎప్పుడైనా ఆలోచించారా..! దీని గురించి తెలుసుకుందాం.
మీరు సాధారణంగా గమనించినట్లయితే చాలా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కోచ్ అమరిక ఒకే విధంగా ఉంటుంది. రాజధాని, శతాబ్ది వంటి పూర్తి ఏసీ రైళ్లలో మినహా చాలా వరకు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మొదట ఇంజిన్, తర్వాత జనరల్ బోగీ, తర్వాత స్లీపర్, ఏసీ బోగీ, ఆ తర్వాత జనరల్ బోగీలు ఉంటాయి. అంటే రైలుకు ఇరువైపులా జనరల్ కోచ్‌లు ఉంటాయి. ఏసీ లేదా పై తరగతి కోచ్‌లు ఎల్లప్పుడూ రైలు మధ్యలో ఉంటాయి. ఎందుకంటే రైలులోని కోచ్‌ల ఆర్డర్‌ను ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
పై తరగతి కోచ్‌లు, లేడీస్ కంపార్ట్‌మెంట్ మొదలైనవి రైలు మధ్యలో ఉంటాయి. అయితే కిక్కిరిసిన జనరల్ బోగీలు మాత్రం రైలుకు ఇరువైపులా ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఇలా చేశారని రైల్వే చెబుతోంది. AC కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకులు ఎక్కువ ఛార్జీలు చెల్లిస్తారు కాబట్టి ఇతర ప్రయాణికులతో పోలిస్తే వారి సౌకర్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఏసీ బోగీలను మధ్యలో ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండే విధంగా చూస్తారు. రైల్వే స్టేషన్‌లోని ఎగ్జిట్ గేట్లు స్టేషన్ మధ్యలో ఉండటాన్ని మీరు గమనించి ఉండాలి. అటువంటి పరిస్థితిలో, రైలు ప్లాట్‌ఫారమ్‌లో ఆగినప్పుడు ఏసీ కోచ్‌లు ఈ ఎగ్జిట్ గేట్‌కు చాలా దగ్గరగా ఉంటాయి. దీంతో ఏసీలో ప్రయాణించే ప్రయాణికులు రద్దీ నుంచి తప్పించుకుని వెంటనే బయటికి వచ్చేస్తారు.
మీడియా నివేదికల ప్రకారం.. జనరల్ కోచ్‌ల రద్దీ నుంచి AC బోగీలోని ప్రయాణికులను రక్షించడానికి ఇలా చేస్తారు. ఒకవేళ జనరల్ బోగీలు మధ్యలో ఉంటే ప్రయాణికుల రద్దీతో మొత్తం గందరగోళం నెలకొంటుంది. అప్పుడు ఇది మొత్తం రైల్వే వ్యవస్థకు భంగం కలిగించవచ్చు. రైలు ప్రారంభమైన వెంటనే సందడి ఉంటుంది. కారణం అందులో దిగే, ఎక్కే ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువ. అందువల్ల, జనరల్ కోచ్‌లను రైలుకి ముందు, వెనకాల అమర్చారు.