JNVST 2022: నవోదయ స్కూల్స్‌లో ప్రవేశాలకు నేడే ఆఖరు తేది.. అర్హులైన విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోండి..

JNVST 2022: జవహర్ నవోదయ విద్యాలయాలలో (JNV) 6వ తరగతిలో ప్రవేశానికి ఏప్రిల్ 30, 2022న ప్రవేశ పరీక్ష జరుగనుంది. దీని పేరు

JNVST 2022: నవోదయ స్కూల్స్‌లో ప్రవేశాలకు నేడే ఆఖరు తేది.. అర్హులైన విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోండి..
Jnv Admission
Follow us
uppula Raju

|

Updated on: Dec 15, 2021 | 1:10 PM

JNVST 2022: జవహర్ నవోదయ విద్యాలయాలలో (JNV) 6వ తరగతిలో ప్రవేశానికి ఏప్రిల్ 30, 2022న ప్రవేశ పరీక్ష జరుగనుంది. దీని పేరు జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST). నవోదయ విద్యాలయ 6వ తరగతి అడ్మిషన్ 2022-23 కోసం దరఖాస్తు చేయడానికి ఈ రోజే (15.12.2021) చివరి తేదీ. మీరు మీ పిల్లలను NVS 6వ తరగతిలో చేర్చాలంటే ఇప్పుడే అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inకి వెళ్లి అప్లికేషన్‌ ఫారం పూర్తి చేయండి. ఇప్పటికే చివరితేది ఒకసారి పొడిగించారు. మీరు ఈ రోజు సాయంత్రం వరకు ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించవచ్చు.

NVS 6వ తరగతి ఈ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశాలకు మే 01 2009, ఏప్రిల్ 30 2013లోపు జన్మించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి ప్రస్తుతం ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతుండడం తప్పనిసరి. NVS దరఖాస్తు ఫారమ్‌లో ఏదైనా తప్పుగా నింపితే సరిదిద్దడానికి మీకు ఇంకా అవకాశం ఉంది. NVS దీని కోసం డిసెంబర్‌16,17 తేదీలను నిర్ణయించింది. మీరు సమర్పించిన ఫారమ్‌లో ఏదైనా పొరపాటు ఉంటే డిసెంబర్ 17, 2021 వరకు సరిదిద్దుకోవచ్చు. అధికారిక నోటీసు ప్రకారం మీరు మీ జెండర్, కేటగిరీ (జనరల్, OBC, SC, ST), ప్రాంతం (గ్రామీణ లేదా పట్టణ), వైకల్యం, పరీక్షా మాధ్యమం (భాష) మొదలైన వాటని మార్చుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి..? navodaya.gov.inలో NVS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. హోమ్ పేజీలో, నవోదయ విద్యాలయ 6వ తరగతి అడ్మిషన్ లింక్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ రాష్ట్రం, జిల్లా, పేరు, మొబైల్ నంబర్, పుట్టిన తేదీని సమర్పించండి. రిజిస్ట్రేషన్ ID రూపొందించిన తర్వాత, వినియోగదారు పేరు, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వండి. ఇప్పుడు దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన మొత్తం సమాచారాన్ని నింపండి. దరఖాస్తు రుసుమును చెల్లించండి. దరఖాస్తును సమర్పించిన తర్వాత ప్రింట్ తీసుకోండి.

Indian Coast Guard 2021: నిరుద్యోగులకు శుభవార్త.. పదో తరగతి అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో పోస్టులు.. జీతం,చివరితేదీ..?

కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని ప్రారంభించిన EeVe ఇండియా.. సింగిల్ ఛార్జీతో 120KM.. ధర, పీచర్లు ఎలా ఉన్నాయంటే..

Indian Railways: ఏసీ కోచ్‌లు రైలు మధ్యలో.. అదే జనరల్‌ బోగీలు ముందు లేదా వెనకాల.. కారణం ఏంటో తెలుసా..?

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.