Kartarpur friends: దోస్త్‌ మేరా దోస్త్‌.. 74 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు.. వైరల్ అవుతున్న వీడియో…

నా ప్రాణ స్నేహితుడా.. తూ హై మేరీ జాన్‌ అంటూ 20 ఏళ్ల వయసులో ఉండగా కలసి పాటలు పాడుకున్నారు. కానీ అనుకోకుండా 1947లో దేశ విభజన వారిని విడదీసింది. ఇప్పుడు మళ్లీ 74 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు మిత్రులను కర్తార్‌పుర్‌ నడవా కలిపింది.నా ప్రాణ స్నేహితుడా.. తూ హై మేరీ జాన్‌ అంటూ 20 ఏళ్ల వయసులో ఉండగా కలసి పాటలు పాడుకున్నారు. కానీ అనుకోకుండా 1947లో దేశ విభజన వారిని విడదీసింది. ఇప్పుడు మళ్లీ 74 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు మిత్రులను కర్తార్‌పుర్‌ నడవా కలిపింది.94 ఏళ్ళ గోపాల్‌ సింగ్, 91 ఏళ్ళ మహమ్మద్‌ బషీర్‌ చిన్ననాటి స్నేహితులు. దేశ విభజన సమయంలో గోపాల్‌ పాకిస్థాన్‌ విడిచి భారత్‌లో స్థిరపడ్డారు. తరువాత మిత్రులిద్దరు కలుసుకోవాలని చాలా సార్లు ప్రయత్నించినా కుదరలేదు. ఇటీవల గురునానక్‌ జయంతి సందర్భంగా కర్తార్‌పుర్‌ నడవాను భారత్, పాకిస్థాన్‌ తెరవడంతో గోపాల్‌.. దర్బార్‌ సాహిబ్‌ సందర్శనకు పాకిస్థాన్‌ వెళ్లారు. అక్కడే వీరిద్దరు అనుకోకుండా ఒకరికొకరు కలుసుకున్నారు. మిత్రుల ఆనందానికి అవధుల్లేవు. పాత రోజులను నెమరువేసుకుంటూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. బాబా గురునానక్‌ గురుద్వారాలో కలిసి భోజనం చేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఏళ్ల తర్వాత కలుసుకున్న ఈ స్నేహితుల ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి.

Click on your DTH Provider to Add TV9 Telugu