BEL Recruitment: బెల్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా హైదరాబాద్ యూనిట్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు...
BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా హైదరాబాద్ యూనిట్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 84 ఖాళీలకు గాను ట్రెయినీ ఇంజనీర్లు (33), ప్రాజెక్ట్ ఇంజనీర్లు (51) పోస్టులు ఉన్నాయి.
* ట్రెయినీ ఇంజనీర్లలో భాగంగా ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 31.12.2021 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
* ప్రాజెక్ట్ ఇంజనీర్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 31.12.2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఐ.ఈ.నాచారం, హైదరాబాద్–500076, తెలంగాణ అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్)లో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 31-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
PRC Meeting: తెగని పీఆర్‌సీ పంచాయితీ.. పట్టువీడని ఉద్యోగ సంఘాలు.. రేపు కూడా చర్చలు..
Income on Petrol and Diesel: పెట్రోల్.. డీజిల్‌పై ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంతో తెలుసా?