Moto G73 5G: నమ్మశక్యంకాని ఫీచర్లతో మోటోరోలా 5జీ ఫోన్‌.. ధర కూడా అందుబాటులోనే.. పూర్తి వివరాలు ఇవి..

మోటో జీ73 హ్యాండ్‌సెట్‌ 8జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజీ సామర్థ్యంతో వస్తోంది. ఇది రెండు కలర్‌ వేరియంట్లు మిడ్‌నైట్ బ్లూ, లూసెంట్ వైట్ ఆప్షన్లలో వస్తోంది. దీనిలో 6.5 అంగుళాల ఎల్‌సీడీ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఉంటుంది.

Moto G73 5G: నమ్మశక్యంకాని ఫీచర్లతో మోటోరోలా 5జీ ఫోన్‌.. ధర కూడా అందుబాటులోనే.. పూర్తి వివరాలు ఇవి..
Moto G73 5g
Follow us
Madhu

|

Updated on: Mar 10, 2023 | 12:15 PM

5జీ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తోంది. ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో వంటి సంస్థలు ఇప్పటికే 5జీ సేవలను దేశ ‍వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ప్రారంభించాయి. అలాగే కొన్ని టైర్‌-2 నగరాల్లో కూడా సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఈ క్రమంలో అన్ని స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్లు తమ 5జీ ఉత్పత్తులను మార్కెట్లోకి లాంచ్‌ చేస్తున్నాయి. ఇదే క్రమంలో మోటోరోలా కూడా కొత్త మోడల్‌ను 5జీ సపోర్టుతో ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మోటో జీ73 5జీ పేరిట ఇండియాలో లాంచ్‌ చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే లాంచ్ అయిన ఈ గ్యాడ్జెట్‌కు సంబంధించిన టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇది ప్రధానంగా రెడ్‌మీ నోట్‌ 12 5జీ, రియల్‌మీ 10ప్రో మోడళ్లకు పోటీగా మార్కెట్లోకి లాంచ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ. 20 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

రెండు కలర్‌ ఆప్షన్లలో..

మోటో జీ73 హ్యాండ్‌సెట్‌ 8జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజీ సామర్థ్యంతో వస్తోంది. ఇది రెండు కలర్‌ వేరియంట్లు మిడ్‌నైట్ బ్లూ, లూసెంట్ వైట్ ఆప్షన్లలో వస్తోంది. దీనిలో 6.5 అంగుళాల ఎల్‌సీడీ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఉంటుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. మీడియా టెక్‌ డెమెన్సిటీ 930 ఓఎస్‌ పై ఇది పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడల్లో 30డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ దొరుకుతోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఈ మొబైల్ పనిచేయవచ్చు.

సూపర్‌ కెమెరా..

ఈ ఫోన్‌ వెనుకవైపు, డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.  ఇందులో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంటుంది. 8 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా లెన్స్ కూడా ఉంది. మాక్రో కెమెరాగా రెట్టింపు అవుతుంది. ప్రైమరీ కెమెరా సెన్సార్ ఫుల్‌ హెచ్‌డీ వీడియోలను 60ఎఫ్‌పీఎస్‌తో రికార్డ్ చేయగలుగుతుంది. ప్రైమరీ కెమెరా 2యూఎం అల్ట్రా-పిక్సెల్ టెక్నాలజీతో వస్తుంది. ఇది రాత్రి సమయంలో కూడా మంచి ఫొటోలను క్యాప్చర్ చేయగలుగుతుంది. కెమెరా యాప్ అల్ట్రా-రెస్ డ్యూయల్ క్యాప్చర్, స్పాట్ కలర్, నైట్ విజన్, మాక్రో విజన్, పోర్ట్రెయిట్, లైవ్ ఫిల్టర్, పనోరమా, AR స్టిక్కర్‌లు, ప్రో మోడ్ (లాంగ్ ఎక్స్‌పోజర్‌తో), స్మార్ట్ కంపోజిషన్, ఆటో స్మైల్ క్యాప్చర్ వంటి ఫీచర్‌లతో వస్తుంది. కెమెరా యాప్ ద్వారా నేరుగా ఇమేజ్‌లు లేదా క్యూఆర్‌ కోడ్‌లలోని వస్తువులను స్కాన్ చేసేందుకు యూజర్లను అనుమతించడానికి Google లెన్స్ ఇంటిగ్రేషన్ కూడా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..