AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Galaxy M14 5G: శాంసంగ్‌ నుంచి తక్కువ ధరలో 5జీ ఫోన్‌.. అదిరే ఫీచర్లు.. ఆకట్టుకునే లుక్.. వివరాలు ఇవి..

శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ బ్లూ, డార్క్ బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లలో లభ్యమవుతోది.

Samsung Galaxy M14 5G: శాంసంగ్‌ నుంచి తక్కువ ధరలో 5జీ ఫోన్‌.. అదిరే ఫీచర్లు.. ఆకట్టుకునే లుక్.. వివరాలు ఇవి..
Samsung Galaxy M14 5g
Madhu
|

Updated on: Mar 10, 2023 | 1:30 PM

Share

మార్కెట్లో 5జీ ట్రెండ్‌ మొదలైంది. అన్ని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రావడంతో అన్ని మొబైళ్ల కంపెనీలు తమ ఉత్పత్తులను 5జీ వేరియంట్లో విడుదల చేస్తున్నాయి. ఇదే క్రమంలో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం అయిన శాంసంగ్, తమ సరికొత్త శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ స్మార్ట్ ఫోన్ ను ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది. త్వరలోనే భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అనువైన బడ్జెట్లోనే ఇది ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ధరలు ఇలా..

శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ బ్లూ, డార్క్ బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను 8,299 యువాన్లుగా (అంటే సుమారు రూ. 18,300), అలాగే 4 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను 8,999 యువాన్లుగా (అంటే సుమారు రూ. 19,900) గా సంస్థ నిర్ణయించింది. మరికొద్ది రోజుల్లో ఈ ఫోన్ ను భారత మార్కెట్ లోకి కంపెనీ విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇలా..

దీనిలో 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. అలాగే 1080 పిక్సల్ స్క్రీన్ ఇన్ఫినిటీ-యూ నాచ్,  ఎక్సినోస్ 1330 చిప్ సెట్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ అందుబాటులో ఉండనుంది. వెనుక వైపు 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, అలాగే 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉంటుంది. ముందు వైపు సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బ్యాటరీ ఇలా..

అలాగే సేఫ్టీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ అందుబాటులో ఉంటుంది. 5జీ సపోర్ట్‌తో ఉండే ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. యూఎస్పీ టైప్-సీ పోర్ట్ తో వస్తోంది. అలాగే 25 వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌తో పనిచేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు