Investment Plans : భారీగా పెరిగిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లు.. పెట్టుబడి సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ప్రస్తుతం బ్యాంకులు తీసుకున్న చర్యల వల్ల డిపాజిట్ దారులు ఒకింత గందరగోళానికి గురవుతున్నారు. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఎఫ్‌డీలపై పెట్టుబడి ద్రవ్యోల్భణాన్ని అధిగమించే స్థాయిలో రాబడిని అందిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ గతేడాది నుంచి ఇప్పటికి వరకూ రెపో రేట్‌ను 250 బేస్ పాయింట్లకు పెంచింది.

Investment Plans : భారీగా పెరిగిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లు.. పెట్టుబడి సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Fixed Deposit
Follow us
Srinu

|

Updated on: Mar 10, 2023 | 2:30 PM

కష్టపడి సంపాదించుకున్న డబ్బును స్థిరమైన ఆదాయం కోసం ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో దాస్తూ ఉంటాం. నమ్మకమైన సంస్థల్లో పెట్టుబడికి మన డబ్బుకు భరోసాతో పాటు రాబడిపై కూడా ఆలోచించవచ్చు. ఆర్‌బీఐ రెపో రేట్లు పెంచడంతో అన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు గణనీయంగా పెంచాయి. ప్రస్తుతం బ్యాంకులు తీసుకున్న చర్యల వల్ల డిపాజిట్ దారులు ఒకింత గందరగోళానికి గురవుతున్నారు. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఎఫ్‌డీలపై పెట్టుబడి ద్రవ్యోల్భణాన్ని అధిగమించే స్థాయిలో రాబడిని అందిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ గతేడాది నుంచి ఇప్పటికి వరకూ రెపో రేట్‌ను 250 బేస్ పాయింట్లకు పెంచింది. రెపో రేట్ అంటే ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాల రేట్. ప్రస్తుతం ఇది 6.5 శాతం వద్ద ఉంది. దీనికి అనుగుణంగా బ్యాంకులు కూడా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచాయి. ఈ వడ్డీ రేట్ల పెంపు పెట్టుబడిదారులను బాగా ఆకర్షిస్తుంది. 

అయితే పెట్టుబడి విషయంలో కొందరు మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్ వంటి స్థిరమైన ఆదాయ మార్గాలు మంచివా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. ఆర్థిక రంగ నిపుణుల ప్రకారం పోస్టల్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీముల్లో అధిక రిటర్న్స్ ఇస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీముల్లో పెట్టుబడి పరిమితి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. సొమ్మను పెట్టుబడి పెట్టే సమయంలో పన్ను ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవాలి. స్థిర ఆదాయ సాధనాల మధ్య ఎంచుకునే సమయంలో కేవలం వడ్డీని మాత్రమే పరిగణలోకి తీసుకోకూడదు. పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. మార్చి 31 సమీపిస్తుంన్నందున ఎఫ్‌డీలపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు కచ్చితంగా పన్ను ప్రణాళికపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..