Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Window AC: మండే వేసవిలో చల.. చల్లగా.! రూ. 20 వేలలోపు లభించే ఏసీలపై ఓ లుక్కేయండి..

వేసవికాలం వచ్చేసింది. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు.. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి...

Window AC: మండే వేసవిలో చల.. చల్లగా.! రూ. 20 వేలలోపు లభించే ఏసీలపై ఓ లుక్కేయండి..
Air Conditioner
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 10, 2023 | 1:56 PM

వేసవికాలం వచ్చేసింది. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు.. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రతీ ఒక్కరూ కూడా ఈ ఎండ వేడిని తట్టుకునేందుకు తమ ఇంట్లో ఓ ఏసీ ఉండాలని భావిస్తారు. అయితే ఈ సమయంలోనే మార్కెట్‌లో ఏసీల ధరల సైతం అమాంతం పెరిగిపోతున్నాయి. ఇందుకు ఖంగారుపడాల్సిన అవసరం లేదు. అటు ఆఫ్‌లైన్.. ఇటు ఆన్‌లైన్‌లోనూ విండో ఏసీలపై పలు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక మీరు ఏసీని ఇంటికి తెచ్చుకునేటప్పుడు తప్పనిసరిగా దాని ఫీచర్లు, కెపాసిటీ, యూజర్ రివ్యూలను చూడాలి. ఇదిలా ఉంటే.. ఆన్‌లైన్‌లో రూ. 20 వేలలోపు లభించే విండో ఏసీలపై ఓ లుక్కేద్దాం పదండి.

బ్రాండ్ నేమ్ ధర
బ్లూ స్టార్ 3WAE081YDF 0.75 టన్ 3 స్టార్ విండో ఎయిర్ కండీషనర్ రూ. 17,499
వోల్టాస్ 102EZQ 0.75 టన్ 2 స్టార్ విండో ఎయిర్ కండీషనర్ రూ. 18,990
వోల్టాస్ 103 DZS 0.8 టన్ 3 స్టార్ విండో ఎయిర్ కండీషనర్ రూ. 19,390
గోద్రెజ్ GWC 12 DTC3 WSA 1 టన్ను 3 స్టార్ విండో ఎయిర్ కండీషనర్ రూ. 18,768
క్యారియర్ ఎస్ట్రెల్లా CAW12ET3N8F0 1 టన్ను 3 స్టార్ విండో ఎయిర్ కండీషనర్ రూ. 19,999
క్రోమా CRAC1181 1 టన్ను 3 స్టార్ విండో ఎయిర్ కండీషనర్ రూ. 19,994
వోల్టాస్ 102 EZQ 0.75 టన్ 2 స్టార్ విండో ఎయిర్ కండీషనర్ రూ. 19,990
వోల్టాస్ WAC 122 PZR 1.5 టన్ 2 స్టార్ విండో ఎయిర్ కండీషనర్ రూ. 18,590
ఇంటెక్స్ 1 టన్ 3 స్టార్ విండో AC (WA12CU3ED) రూ. 16,790
లాయిడ్ 1 టన్ 3 స్టార్ విండో AC (LW12A3F9) రూ. 20,000

కాగా విండో ఏసీని ఉపయోగించేటప్పుడు కచ్చితంగా ఈ మూడు విషయాలను గుర్తించుకుంటే.. మీ కరెంట్ బిల్లు తక్కువగా రావచ్చు.

ACని సరైన టెంపరేచర్ వద్ద సెట్ చేయండి: AC టెంపరేచర్ ఒక నిర్దిష్ట డిగ్రీల వద్ద సెట్ చేయడం మర్చిపోవద్దు. వాస్తవానికి తక్కువ టెంపరేచర్ వద్ద ఏసీని రన్‌ చేయకూడదు.15 నుంచి 16 డిగ్రీల వద్ద ఏసీని సెట్ చేస్తే.. కరెంటు బిల్లు వాచిపోతుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రకారం.. ACని 24 డిగ్రీల వద్ద సెట్ చేయాలి. ఈ ఉష్ణోగ్రత మన శరీరానికి ఉత్తమమైనది. అలాగే కరెంటు బిల్లు కూడా ఎక్కువగా రాదు.

ఏసీలో టైమర్‌ సెట్‌ చేయండి: ఈ రోజుల్లో అన్ని ఏసీలకు టైమర్ ఉంటోంది. రాత్రిపూట AC టైమర్‌ని సెట్ చేయడం మంచిది. అలా చేస్తే.. గది పూర్తిగా చల్లబడిన వెంటనే.. టైమర్ ప్రకారం ఏసీ దానంతట అదే ఆగిపోతుంది. దీంతో కరెంట్ ఆదా చేయవచ్చు. తద్వారా బిల్లు కూడా తగ్గుతుంది.

పవర్ బటన్‌ను ఆఫ్ చేయడం మర్చిపోవద్దు: ఒకవేళ ఏసీని ఆఫ్ చేసినప్పుడు.. కచ్చితంగా పవర్ బటన్‌ కూడా ఆఫ్‌లో ఉందా.? లేదా.? అన్నది చూసుకోవాలి. చాలామంది రిమోట్‌తో ఏసీని ఆఫ్ చేసి పవర్ బటన్‌ను మాత్రం అలా వదిలేస్తారు. దీని వల్ల అనవసరంగా కరెంటు ఖర్చవుతుంది. బిల్లు కూడా పెరుగుతుంది. దీన్ని సేవ్ చేయాలంటే.. రిమోట్ ద్వారా ఏసీ ఆఫ్ చేయడంతో పాటు.. పవర్ బటన్‌ను ఆఫ్ చేయాలి.

నోట్: పైన ఇచ్చిన ధరలు మోడల్స్‌కు తగ్గట్టుగా మారే అవకాశాలు ఉండొచ్చు.. ఇది కేవలం సమాచారం కోసం ఇచ్చినది.