Hyundai Alcazar: స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో హ్యూందాయ్‌ కొత్త ఎస్‌యూవీ.. కేవలం రూ. 25,000లకే బుకింగ్..

హ్యూందాయ్‌ అల్కాజర్‌ మోడల్‌ను ఇటీవల ఆ కంపెనీ లాంచ్‌ చేసింది. 1.6 లీటర్‌ టర్భో పెట్రోల్‌ ఎస్‌యూవీ వేరియంట్లో వచ్చిన దీని ధరలు రూ.16.75 లక్షల నుంచి రూ.20.25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. మూడు వరుసల ఈ ఎస్‌యూవీ 6-సీటర్, 7-సీటర్ కాన్ఫిగరేషన్స్‌తో లభిస్తుంది.

Hyundai Alcazar: స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో హ్యూందాయ్‌ కొత్త ఎస్‌యూవీ.. కేవలం రూ. 25,000లకే బుకింగ్..
Hyundai Alcazar
Follow us
Madhu

|

Updated on: Mar 10, 2023 | 11:55 AM

కార్ల కంపెనీల్లో హ్యూందాయ్‌కి మంచి పేరుంది. మన భారతీయ మార్కెట్లో ఈ బ్రాండ్‌ కార్లకు డిమాండ్‌ కూడా బాగానే ఉంది. ఈ క్రమంలోనే ఆ కంపెనీ అనేక కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తోంది. అలాగే ఇప్పటికే ఉన్న కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్‌ చేసి మార్కెట్లో లాంచ్‌ చేస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో హ్యూందాయ్‌ అల్కాజర్‌ మోడల్‌ను ఇటీవల ఆ కంపెనీ లాంచ్‌ చేసింది. 1.6 లీటర్‌ టర్భో పెట్రోల్‌ ఎస్‌యూవీ వేరియంట్లో వచ్చిన దీని ధరలు రూ.16.75 లక్షల నుంచి రూ.20.25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. మూడు వరుసల ఈ ఎస్‌యూవీ 6-సీటర్, 7-సీటర్ కాన్ఫిగరేషన్స్‌తో లభిస్తుంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆ మోడళ్లకు పోటీగా..

హ్యూందాయ్‌ అల్కాజర్‌ ను టాటా సఫారీ, ఎంపీ హెక్టర్‌ ప్లస్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి మోడళ్లకు పోటీగా ఆ కంపెనీ లాంచ్‌ చేస్తోంది. హ్యూందాయ్‌ అల్కాజర్‌ 115లీటర్ల టర్భో పెట్రోల్‌ మోడల్‌ లో మొత్తం నాలుగు వేరియంట్లు ఉన్నాయి. ప్రెస్టేజ్, ప్లాటినం, ప్లాటినం ఓ, సిగ్నేచర్ ఓ వంటి నాలుగు వేరియంట్లలలో ఈ వెహికల్ అందుబాటులోకి వచ్చింది.

ధరలు ఇలా..

వీటి ధరలను పరిశీలిస్తే.. అల్కాజర్ 7 సీటింగ్ కాన్ఫిగరేషన్‌లో, 6ఎంటీ ట్రాన్స్‌‌మిషన్ ఆప్షన్‌లో ప్రెస్టేజ్, ప్లాటినం ట్రిమ్స్ లభిస్తున్నాయి.  ప్రెస్టేజ్ ట్రిమ్ ఎక్స్‌షో‌రూమ్ ధర రూ.16,74,900 కాగా, ప్లాటినం వేరియంట్ ధర రూ.18,65,100గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లో 7డీసీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో ప్లాటినం ఓ, సిగ్నేచర్ ఓ ట్రిమ్స్ లభిస్తున్నాయి. వీటి ధరలు వరుసగా రూ.19,96,000, రూ.20,25,100గా ఉన్నాయి. అదే విధంగా అల్కాజర్ 6 సీటర్ కాన్ఫిగరేషన్‌లో 7డీసీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో ప్లాటినం ఓ, సిగ్నేచర్ ఓ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు వరుసగా రూ.19,96,000, రూ.20,25,100గా కంపెనీ నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

ప్రత్యేకతలు ఇవి..

హుందాయ్ అల్కాజర్ కారు 1.5 లీటర్‌ టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తుంది. ఇది కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్స్‌తో లాంచ్ అయింది. అల్కాజర్‌ లోగో‌తో న్యూ ఫ్రంట్ గ్రిల్ డిజైన్, రీ డిజైన్ పుడ్ల్ ల్యాంప్ అప్‌గ్రేడ్ అయ్యాయి. ఈ ఎస్‌యూవీ అప్‌డేట్ వెర్షన్‌లో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. ఫేస్‌లిఫ్ట్ స్టాక్ ఫిట్‌మెంట్‌గా ఐడిల్ స్టాప్ అండ్‌ గో ఫీచర్‌ కూడా ఇందులో ఉంటుంది. స్టాప్ అండ్‌ గో స్పెసిఫికేషన్ అనేది వివిధ డ్రైవింగ్ మోడ్స్‌తో ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది. అల్కాజర్-2023 అప్‌గ్రేడ్ వెర్షన్ 1.5L టర్బో GDi పెట్రోల్ ఇంజన్‌తో వచ్చింది. రియల్ డ్రైవింగ్ ఉద్గారాల (RDE) నిబంధనలకు అనుగుణంగా కంపెనీ E20 ఫ్యూయల్ రెడీతో ఈ SUV ఇంజిన్‌‌ను అప్‌గ్రేడ్ చేసింది.

బుకింగ్స్‌ ప్రారంభం..

హ్యూందాయ్‌ అల్కాజర్‌ బుకింగ్స్‌ ను కంపెనీ ప్రారంభించింది. అన్ని హ్యూందాయ్‌ అవుట్‌ లెట్ల వద్ద కేవలం రూ. 25,000 మొత్తాన్ని చెల్లించి స్లాట్‌ బుక్‌చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..