Electric Vs Petrol Scooter: పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఏది బెస్ట్? మీకు ఉపయోగపడే టిప్స్ ఇవిగో.. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం..
పెట్రోల్ డీజిన్ ఇంజిన్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్ వాహనాల్లో ఏది కొనుగోలు చేయాలి? రెండింటిలో ఏది బెస్ట్? అనే సందేహం చాలా మందిలో ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల పనితీరుపై కొన్ని సందేహాలు, అపోహలు కూడా వెంటాడుతున్నాయి.

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అలా అని పెట్రోల్, డీజిల్ వాహనాలకు డిమాండ్ తగ్గడం లేదు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజలకు మక్కువ చూపుతున్నారు. అలాగే పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలు కూడా పెద్ద ఎత్తున మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉంటున్న పెట్రోల్ డీజిన్ ఇంజిన్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్ వాహనాల్లో ఏది కొనుగోలు చేయాలి? రెండింటిలో ఏది బెస్ట్? అనే సందేహం చాలా మందిలో ఉంది. ఎలక్ట్రిక వాహనాల పనితీరుపై కొన్ని సందేహాలు, అపోహలు కూడా వెంటాడుతున్నాయి. మీరు కూడా ఇలాంటి సందేహాలు, అనుమానాలతోనే ఉంటే ఈ కథనం మీ కోసమే. దీనిని చదివితే ఏ వేరియంట్ బండి కొనుగోలు చేయవచ్చో క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది.
రోజుకు ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేస్తారు.. మీరు ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుచేయాలనుకుంంటే ముందుగా మీరు ఆలోచించవలసిన విషయం మీరు రోజు ప్రయాణించే దూరం. మీరు ఒకవేళ రోజుకి 70 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ప్రయాణించే వారైతే మీకు ఎలక్ట్రిక్ వాహనం సరైనా ఆప్షన్‌కాకపోవచ్చు. లోకల్ అవసరాలకు, తక్కువ దూరాలకు ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లు ఉపయుక్తంగా ఉంటాయి.
చార్జింగ్ పాయింట్లు ఉన్నాయా.. మీరు ఒక వేళ ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలనుకుంటే మొదట మీరు నివసించే ప్రాంతంలో చార్జింగ్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. కనీసం ఒకటి రెండైనా మీ సమీపంలో చార్జింగ్ స్టేషన్లు ఉంటే మీరు ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసుకోవచ్చు. ఒకవేళ ఒక్కటి కూడా చార్జింగ్ స్టేషన్ లేకపోతే ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుపై మీరు మరోసారి ఆలోచించాల్సిందే.
వాతావరణ పరిస్థితులు.. మీరు నివసించే, లేదా ప్రయాణించే ప్రాంతం కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభావం చూపుతాయి. ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీ వాతావరణ పరిస్థితులకు లోనవుతుంది. చల్లని లేదా అత్యంత వేడి వాతావరణాలు బ్యాటరీలపై ప్రభావం చూపుతాయి. ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసేటప్పుడు దీనిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
ఎంతమంది ప్రయాణిస్తారు.. మీరు స్కూటర్‌పై ఒక్కరే ప్రయాణించే వారైతే ఎలక్ట్రిక్ వాహనం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి వాహనంపై కనీసం ఇద్దరు ప్రయాణించే వీలుంటుంది కానీ ఈ-స్కూటర్లపై ఇద్దరు ప్రయాణిస్తే వాటి మైలేజీ(రేంజ్) పడిపోతుంది. అందుకే మీరు ఎలక్ట్రికద్విచక్ర వాహనం కొనుగోలు చేసేముందుకు ఈ ఫ్యాక్టర్‌ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..