AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీజన్ మారుతోంది పిల్లలకు పొడిదగ్గు సమస్య కంగారుపెడుతోందా..అయితే ఈ వంటింటి చిట్కాలు మీకోసం..

పిల్లలలో చలికాలంలో లేదా సీజన్ మారే కాలంలో దగ్గు అనేది ఒక సాధారణ వ్యాధి. దగ్గు అనేది అలెర్జీలు, జలుబు, ఫ్లూ, ఆస్తమా, బ్రోంకైటిస్‌తో సహా అనేక అనారోగ్యాల లక్షణం.

సీజన్ మారుతోంది పిల్లలకు పొడిదగ్గు సమస్య కంగారుపెడుతోందా..అయితే ఈ వంటింటి చిట్కాలు మీకోసం..
Cough
Madhavi
| Edited By: |

Updated on: Mar 11, 2023 | 9:36 AM

Share

పిల్లలలో చలికాలంలో లేదా సీజన్ మారే కాలంలో దగ్గు అనేది ఒక సాధారణ వ్యాధి. దగ్గు అనేది అలెర్జీలు, జలుబు, ఫ్లూ, ఆస్తమా, బ్రోంకైటిస్‌తో సహా అనేక అనారోగ్యాల లక్షణం. అయితే దగ్గుకు అనేక మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలలో దగ్గును నయం చేయడానికి వంట ఇంటి చిట్కాలను ఉపయోగించడానికి ఇష్టపడతారు.అలాంటి వంట ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.

తేనె:

ఒక సంవత్సరం కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఒక చెంచా తేనె తాగిస్తే, ప్రయోజనం ఉంటుంది. దీంతో పొడి దగ్గు వల్ల వచ్చే గొంతునొప్పి కూడా తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి

వెచ్చని నీటితో పుక్కిలించడం:

గొంతు నొప్పితో తీవ్రంగా బాధపడితే మాత్రం పిల్లవాడు గోరువెచ్చని నీటితో పుక్కిలించేలా చేయండి. వీలైతే వెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించేలా చూడండి. తద్వారా ఇది గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది.

ఆవిరి పట్టడం:

పొడి దగ్గు ఉన్నప్పుడు, వేడి వేడి ఆవిరి పట్టిస్తే శ్వాసకోశం క్లియర్ అవుతుంది. అలాగే వేడి నీటితో పిల్లవాడిని స్నానం చేయించి, ఉన్ని దుస్తులు వేసి ప్రయత్నించండి. తద్వారా పొడి దగ్గు తగ్గిపోతుంది.

విక్స్ రాయండి:

పిల్లల ఛాతీపై విక్స్‌ వేపరబ్ లాంటివి పూయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఛాతీపై విక్స్ వేపరబ్ రుద్దడం ద్వారా పిల్లలకు ఉపశమనంతో పాటు, మంచి నిద్ర కూడా కలుగుతుంది. ఫలితంగా పొడి దగ్గు సైతం త్వరగా నయం అవుతుంది.

పసుపు పాలు:

పొడి దగ్గును నయం చేయడానికి పిల్లలకు పసుపు పాలు ఇవ్వవచ్చు. పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ముక్కు కారడాన్ని నయం చేస్తాయి. ఇది గొంతుకు కూడా ఉపశమనం కలిగిస్తుంది.

పిల్లలను హైడ్రేటెడ్ గా ఉంచండి:

పిల్లల్లో డీహైడ్రేషన్ ఉంటే కూడా గొంతు సమస్యలు ఎదురవుతాయి.పిల్లవాడికి గొంతు సమస్య ఉంటే అతనికి రోజంతా కనీసం 1-2 గ్లాసుల వెచ్చటి నీరు ఇవ్వాలి.

దానిమ్మ రసం:

అరకప్పు దానిమ్మ రసంలో చిటికెడు అల్లం పొడి వేసి పిల్లలకు ఇవ్వండి. ఇది పొడి దగ్గులో వేగవంతమైన ప్రభావాన్ని చూపుతుంది.ః

తేనె-అల్లం:

పిల్లలకి దగ్గు కఫం సమస్య ఉంటే, తేనె అల్లం రసం ఇవ్వండి. దీంతో గొంతు నొప్పి, కఫం తొలగిపోతాయి. అల్లం తేనె తింటే శ్లేష్మం బయటకు వస్తుంది. దీని కోసం అల్లం తురుమి దాని రసం తీయండి. అందులో 2 చెంచాల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2-3 సార్లు తాగించండి.

తేనె-మిరియాలు:

దగ్గు జలుబులో తేనె నల్ల మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి.. బ్లాక్ పెప్పర్‌లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇది గొంతు ఇన్ఫెక్షన్‌ను తొలగిస్తుంది. ఇది దగ్గు కఫం తగ్గిస్తుంది. మిరియాలను పొడి చేసి ఒక చెంచా తేనె కలిపి పిల్లవాడికి తాగించాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..