- Telugu News Photo Gallery Science photos Asteroids hits earth how a big asteroid to destroy los angeles ,hawaii and washington dc in telugu
Asteroid: భూమి వైపు దూసుకురానున్న గ్రహ శకలం.. ఆ నగరాలకు ముప్పు ఉందంటున్న శాస్త్రవేత్తలు
ఆకాశం నుంచి పడే గ్రహశకలం ఏదైనాసరే ప్రధాన మెట్రోపాలిటన్ నగరాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంటుంది. గ్రహశకలం తాకిడికి హిందూ మహాసముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు కల్లోలానికి గురవుతాయని.. పశ్చిమం నుండి అమెరికా తూర్పు తీరం వరకు ప్రభావం పడనుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
Updated on: Mar 11, 2023 | 11:12 AM

ఆకాశం నుంచి పడే గ్రహశకలం ఏదైనాసరే ప్రధాన మెట్రోపాలిటన్ నగరాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంటుంది. గ్రహశకలం తాకిడికి హిందూ మహాసముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు కల్లోలానికి గురవుతాయని.. పశ్చిమం నుండి అమెరికా తూర్పు తీరం వరకు ప్రభావం పడనుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

గ్రహశకలం భూమిని ఢీకొట్టడం లేదా ప్రయాణిస్తున్న వార్తలను మీరు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి గ్రహశకలాలు కొన్ని పెద్దవి.. మరికొన్ని చిన్నవి. అయితే ఇప్పటికంటే రాబోయే సంవత్సరాల్లో ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టగలదని.. ఇలా ఈ ఢీ కొట్టడం వల్ల భారీ వినాశనానికి దారి తీస్తుందనే కొత్తవార్తలు వినిపిస్తున్నాయి. ఈ గ్రహశకలం పేరు '2023 DW'. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గత నెల ఫిబ్రవరి 26న ఈ కొత్త గ్రహశకలాన్ని గుర్తించింది.

NASA ఆస్టరాయిడ్ వాచ్ ప్రకారం.. ఆస్టరాయిడ్ 2023 DW ప్రమాద జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అంతరిక్ష సంస్థ ఈ జాబితాను ప్రమాద జాబితా అని పిలుస్తారు. ఇందులో.. రాబోయే కాలంలో భూమిని ఢీకొట్టి భారీ నష్టాన్ని కలిగించే రాళ్లు లేదా గ్రహశకలాల జాబితా ఉంది. ఈ గ్రహశకలం ఎంత పెద్దదో, దాని ఢీకొనడం వల్ల కలిగే నష్టం అంత భారీగా ఉంటుంది.

ఆస్టరాయిడ్ 2023 DW రిస్క్ లిస్టులో మొదటి స్థానంలో ఉంది. ఈ గ్రహశకలం వలన భూమికి పెను విపత్తు సంభవించే అవకాశం ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ గ్రహశకలం వ్యాసం సుమారు 50 మీటర్లు, దాని పొడవు ఒలింపిక్ క్రీడల స్విమ్మింగ్ పూల్ వలె ఉంటుంది. అయితే.. ఈ గ్రహశకలం పరిమాణం ఇంకా పెద్దదిగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

శాస్త్రవేత్తలు వద్ద ఈ గ్రహశకలం ఎప్పుడు ఏ సమయంలో భూమిని ఎప్పుడు ఢీకొంటుంది అనే విషయంలో ఖచ్చిత సమయం లేదు. అయితే 23 సంవత్సరాల తర్వాత.. ఈ గ్రహశకలం 2046లో భూమిని ఢీకొనే అవకాశం ఉందని.. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ శకలం తాకిడి 2047, 2051 మధ్య సంభవించవచ్చు అని పేర్కొన్నారు.

అయితే ఏ గ్రహశకలం ఏ సంవత్సరంలోనైనా భూమితో ఘర్షణ పడవచ్చు అని.. అయితే ఏ ఏడాదిలోనైనా ఫిబ్రవరి 14 మాత్రమే తేదీ ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంటే ప్రేమికుల రోజునే ఈ గ్రహశకలం విధ్వంసం సృష్టించగలదు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA ప్రకారం, గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం 607లో మాత్రమే ఉంటుంది.

డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. ఈ గ్రహశకలం ఏదైనా ప్రధాన మెట్రోపాలిటన్ నగరాన్ని నాశనం చేసే శక్తిని కలిగి ఉంటుంది. దీని తాకిడి ఏర్పడే హిందూ మహాసముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు.. పశ్చిమం నుండి అమెరికా తూర్పు తీరం వరకు విస్తరించి ఉన్నాయి. వాషింగ్టన్ DC, లాస్ ఏంజిల్స్ , హవాయి దీవులు వంటి US నగరాలు కూడా గ్రహశకలం తాకే ప్రాంతాల్లో చేర్చబడ్డాయి.





























