Raisins Benefits: ఎండు ద్రాక్ష ప్రయోజనాలేమిటో తెలుసా..? తెలిస్తే క్రమం తప్పకుండా తింటారు..

ఎండు ద్రాక్షలు ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తాయి. ఇంకా ఈ ఎండు ద్రాక్షలను పరిమితంగా తింటే ఫ్యాట్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు..

Raisins Benefits: ఎండు ద్రాక్ష ప్రయోజనాలేమిటో తెలుసా..? తెలిస్తే క్రమం తప్పకుండా తింటారు..
Raisins
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 11, 2023 | 2:00 PM

ఎండు ద్రాక్షలను తినే ఆహారంలో చేర్చుకుంటే.. అనేక రకాల పోషకాలను శరీరానికి అందించినట్లే. ఈ పోషకాలు మనకు ఎంతగానో ఉపకరించడమే కాక ఎన్నో ప్రయోజనాలను కూడా అందిస్తాయి.సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడుగునా లభించే ఎండు ద్రాక్షలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ( Fiber ) పుష్కలంగా ఉంటాయి. అంతకుమించి ఎండు ద్రాక్షలు ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తాయి. ఇంకా ఈ ఎండు ద్రాక్షలను పరిమితంగా తింటే ఫ్యాట్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కూడా దరి చేరవు. మరి ఈ క్రమంలో ఎండుద్రాక్షలను తినడం ద్వారా ఏయే ప్రయోజనాలను పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండు ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

శక్తి: ఎండుద్రాక్షలు కార్బోహైడ్రేట్లు, నేచరల్ షుగర్‌లతో ఉంటాయి. ప్రతి రోజు కొన్ని ఎండు ద్రాక్షలు తినటం వల్ల మన శరీరానికి కావలసిన శక్తి అందుతుంది.

బరువు తగ్గడం: ఎండు ద్రాక్షలను నిత్యం తినే వ్యక్తులు తక్కువ బరువును కలిగి ఉంటారు. ఇంకా వీరికి ఊబకాయం కూడా దూరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రక్తహీనత: ఎండుద్రాక్షలు ఐరన్‌ను అధికంగా కల్గి ఉంటాయి. కాబట్టి రక్తహీనతతో   బాధపడేవాళ్లకు ఇది చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఐరన్ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇంకా ఐరల్ లోపాన్ని కూడా అధిగమించవచ్చు.

చర్మం కోసం: ఎండుద్రాక్షలో అనామ్ల జనకాలు సమృద్ధిగా ఉంటాయి. తద్వారా ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, నష్టాన్నితగ్గించడానికి సహాయపడతాయి. ఇంకా కళ్ల కింద చారలు, చర్మపు ముడుతలను నిరోధిస్తుంది. ఎండు ద్రాక్ష చర్మ క్యాన్సర్‌ను నివారించడానికి కూడా సహాయపడుతుంది.

జీర్ణక్రియ కోసం: ఎండుద్రాక్షలు పీచుపదార్థాలకు మంచి మూలం. కాబట్టి మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలను నివారించడంలో ఎండు ద్రాక్ష మనకు  సహాయపడుతుంది.

మధుమేహం: ఎండుద్రాక్షలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి ఎందుకంటే అవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. ఇంకా మధుమేహం ఉన్నవారికి ఇది ఓ మంచి ఆరోగ్యకరమైన చిరుతిండిగా ఉంటుంది.

గుండె కోసం: ఎండు ద్రాక్షలు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడంలో  సహాయపడతాయి. తద్వారా గుండె సమస్యలు ఎదురయ్యే ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి మనకు ఉపయోగపడతాయి.

పళ్ళు కోసం: ఎండు ద్రాక్షలు తీపిగా ఉన్నప్పటికీ, వాటిలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. ఆ కారణంగా ఇవి పళ్ళకు హాని చేయవు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే