AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Disease: నిజమా! బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? అసలు విషయం తెలుసుకోండి

కిడ్నీలో రాళ్లా? అయితే బీర్ తాగండి చాలు! అదేంటి అలా చెబుతున్నారు. ఏ వైద్యుడు చెప్పారు ఇది అని ఆశ్చర్యపోతున్నారా? మన దేశంలో జనాలు దీనినే నమ్మతున్నారు మరి! ప్రతి ముగ్గురిలో ఒకరి వాదన ఇదేనట. 

Kidney Disease: నిజమా! బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? అసలు విషయం తెలుసుకోండి
Beer
Madhu
|

Updated on: Mar 11, 2023 | 4:59 PM

Share

ఇటీవల కాలంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు ప్రబలుతున్నాయి. జీవనశైలి మార్పులు, ఆహారం , వ్యాయామం లేకపోవడంతో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. గతంలో ఈ సమస్య వృద్ధాప్యంలో ఉండే వారిలో మాత్రమే గమనించేవారు.. అయితే ప్రస్తుతం యువకులు సైతం కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. మన భారతదేశంలో కిడ్నీ లో రాళ్ల సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ఆహార అలవాట్లు, కిడ్నీల పనితీరుపై కనీస అవగాహన లేకపోవడమే కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ చాలా మంది చికిత్స చేయించుకునేందుకు ఇష్టపడటం లేదు. పైగా బీర్ తాగితే రాళ్లు కరిగిపోతాయనే భావనతో ఉన్న వారు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారట. ఇది మేం చెబుతున్నది కాదు. ఇటీవల ప్రముఖ హెల్త్‌కేర్ ప్రొవైడర్ అయిన ప్రిస్టిన్ నిర్వహించిన సర్వేలో ఈ విధమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సర్వే ఇలా..

వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా దేశంలో ప్రిస్టిన్ అనే సంస్థ ఓ పోల్ నిర్వహించింది. దీనిలో ప్రతి ముగ్గురిలో ఒకరు రోజూ బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయని నమ్ముతున్నామని చెప్పారు. అయితే ఇది వాస్తవం కాదని, సక్రమమైన చికిత్సతోనే అది నయం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పోల్ లో మొత్తం 1000 సమాధానాలు ఉన్నాయి. అందులో 50 శాతం మంది కిడ్నీ రాళ్ల సమస్యపై సర్జరీ చేయించుకునేందుకు విముఖత వ్యక్తం చేశారు.

పెరుగుతున్న కిడ్నీ రోగులు..

మన దేశంలో కిడ్నీ వ్యాధులు బాగా ప్రభలుతున్నాయి. 2021తో కంపేర్ చేస్తే 2022లో కిడ్నీ వ్యాధులపై ఆన్ లైన్ కన్సల్టేషన్ దాదాపు 180 శాతం పెరిగింది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్యలతో పురుషులు అధికంగా ఆస్పత్రులకు వస్తున్నట్లు తేలింది.

ఇవి కూడా చదవండి

అవగాహన లేదు..

మధుమేహం, రక్తపోటు కారణంగా కిడ్నీలు ప్రభావితం అవుతాయి. ఈ రెండు అదుపులో లేకపోతే కిడ్నీలు త్వరగా పాడయిపోతాయి. అయితే ఈ విషయంపై చాలా మందికి అవగాహన ఉండటం లేదు. ఇదే విషయం ప్రిస్టిన్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో స్పష్టం అయ్యింది. ఆ పోల్ పాల్గొన్న 14 శాతం మందికి ఈ విషయం అసలు తెలీదట. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆ పోల్ పాల్గొన్న సగం మందికి కిడ్నీలు ఏం పని చేస్తాయో కూడా తెలీదని చెప్పారట. కేవలం 9 శాతం మంది మాత్రమే కిడ్నీలపై అవగాహన ఉన్నట్లు చెప్పారు. కేవలం ఏడు శాతం మాత్రమే ఎముకల ఆరోగ్యానికి కిడ్నీలకు లింక్ ఉన్నట్లు గుర్తించామన్నారు. 68 శాతం మంది కిడ్నీలో రాళ్ల సమస్యకు సర్జరీ సేఫ్ అని భావిస్తున్నారు. 50 శాతం మంది చికిత్సను కనీసం ఆరు నెలలు వాయిదా వేసేందుకు మొగ్గుచూపుతున్నారు.

ముందుగా గుర్తించాలి..

కిడ్నీ సమస్యలను ముందుగా గుర్తిస్తే నయం చేయడం సులభం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా షుగర్, బీపీ ఉన్నవాళ్లు తరచూ సీరమ్ క్రియాటిన్ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే చాలా మంది వర్కౌట్లు చేస్తూ విచ్చలవిడిగా ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటున్నారు. ఎటువంటి నిపుణుల పర్యేవేక్షణ లేకుండా చేస్తున్నారు. అయితే ఈ మితిమీరిన ప్రోటీన్ సప్లిమెంట్ల కారణంగా కూడా కిడ్నీలో రాళ్లు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..