Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రెడిట్ కార్డు తీసుకుంటే స్మార్ట్‌ఫోన్ ఫ్రీ.. తీరా ఆఖర్లో మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ చూడగా..!

అమాయకులను మోసం చేసేందుకు సైబర్ మోసగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. మెదడుకు పదునుపెట్టి..

క్రెడిట్ కార్డు తీసుకుంటే స్మార్ట్‌ఫోన్ ఫ్రీ.. తీరా ఆఖర్లో మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ చూడగా..!
Cyber Crime
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 13, 2023 | 7:57 PM

అమాయకులను మోసం చేసేందుకు సైబర్ మోసగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. మెదడుకు పదునుపెట్టి.. సరికొత్త ఐడియాలతో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఓ సైబర్ నేరం ముంబైలో జరిగింది. ఆ కేసు పోలీసులకే మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ముంబైకి చెందిన ఓ మహిళకు జనవరిలో సౌరభ్ శర్మ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తమ సంస్థ క్రెడిట్ కార్డు తీసుకుంటే.. స్పోర్ట్స్ క్లబ్‌లో మెంబర్‌షిప్ లభిస్తుందని నమ్మించాడు. ఇక సదరు బాధితురాలు అతడి మాటలను నమ్మింది. కార్డు తీసుకునేందుకు అంగీకరించింది. అయితే ఆ మహిళ ఐఫోన్ వినియోగిస్తోందని తెలుసుకున్న నిందితుడు.. తమ క్రెడిట్ కార్డు ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే పని చేస్తుందని.. కార్డు తీసుకుంటే.. స్మార్ట్ ఫోన్ ఫ్రీగా దొరుకుతుందని పేర్కొన్నాడు. దీంతో బాధితురాలు అతడికి తన ఇంటి అడ్రెస్ ఇచ్చింది. అలాగే క్రెడిట్ కార్డు కోసం వ్యక్తిగత వివరాలను, ఆదార్ కార్డు నెంబర్‌ను సైతం షేర్ చేసింది.

ఇక ఆ స్మార్ట్‌ఫోన్‌ను సరాసరి ఆమె ఇంటికే పంపించాడు సైబర్ కేటుగాడు. అందులో ముందుగానే DOT సెక్యూర్, సెక్యూర్ ఎన్వాయ్ ఆథెంటికేటర్ అనే రెండు యాప్స్ ఇన్‌స్టాల్ చేసి ఉన్నాయి. సిమ్ కార్డు ఇన్‌సర్ట్ చేసి.. క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేసిందో లేదో.. కొన్ని గంటల్లోనే డబ్బు లావాదేవీలకు సంబంధించిన మెసేజ్‌లు వచ్చాయి. దాదాపుగా రూ. 7 లక్షలు అకౌంట్ నుంచి మాయం అయినట్లు గుర్తించిన మహిళ.. షాక్‌కు గురై వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కాగా, ఈ ఘటనపై ఖాకీలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..