ప్రియుడిని కలిసేందుకు వచ్చిన ప్రియురాలు శవమైంది.. ఎయిర్ హోస్టెస్ మృతి కేసులో సంచలనాలు!
Karnataka air hostess: బ్రేకప్‌కు ముందు ప్రియుడ్ని కలిసేందుకు దుబాయ్ నుంచి బెంగుళూరు వచ్చిన ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.

ప్రియుడిని కలవడానికి దుబాయ్ నుంచి వచ్చిన ఒక ఎయిర్ హోస్టేన్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఫ్రీలాన్స్ మోడల్ కూడా అయిన ఓ ఎయిర్‌లైన్ ఉద్యోగి, తన ప్రియుడిని కలుసుకునేందుకు బెంగళూరుకు వెళ్లింది. నగరంలోని ఎత్తైయిన అపార్ట్‌మెంట్ నుండి పడి హఠాత్తుగా మరణించింది. మృతురాలిని అర్చన ధీమాన్‌గా గుర్తించారు. అయితే, తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకోవడంతో తట్టుకోలేక ప్రియుడు ఆమెను హత్య చేసి ఉంటాడని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీరిద్దరూ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. అయితే ఈ క్రమంలో మూడునెలలుగా, ఎయిర్ హోస్టెస్ అర్చన తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల మహిళ ఒక అంతర్జాతీయ ఎయిర్‌లైన్ కంపెనీలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోంది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన కేరళకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆదేశ్‌తో ప్రేమాయణం సాగించింది. ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరగడంతో గత ఆరు నెలలుగా వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. తరచుగా గొడవపడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రేకప్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే బ్రేకప్‌కు ముందు ప్రియుడ్ని కలిసేందుకు దుబాయ్ నుంచి బెంగుళూరు వచ్చిన ఎయిర్ హోస్టెస్ అర్చన. ఇద్దరూ కలిసి థియేటర్‌కు వెళ్లి సినిమా కూడా చూశారు. అనంతరం అర్ధరాత్రి 12 గంటలకు కోరమంగళ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌కు తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం, గొడవ జరిగింది. ఇంతలోనే బిల్డింగ్ నాలుగో అంతస్తు పైనుంచి కింద పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే తన కూతురు ప్రియుడు ఆదేశ్ చంపేశాడని అర్చన తల్లి ఆరోపించింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆదేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల చెప్పిన కథనం ప్రకారం.. ఇద్దరూ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. గత మూడు నెలలుగా మృతురాలు అర్చన తన ప్రియుడు ఆదేశ్‌ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని.. కానీ, నిందితులు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో పలు కారణాలు చెప్పి వాయిదా వేసుకున్నారని పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అర్చన హెచ్చరించింది. దీంతో కోపోద్రిక్తుడైన ప్రియుడు ఆదేశ్ అపార్ట్ మెంట్ నుంచి బయటకు నెట్టేశాడు. అర్చన అక్కడికక్కడే మృతి చెందింది. అర్చనను హత్య చేసిన తర్వాత నిందితుడు ఆమె తండ్రికి ఫోన్ చేసి మద్యం మత్తులో తన కూతురు భవనంపై నుంచి పడిపోయిందని చెప్పాడని పోలీసులు తెలిపారు. పోలీసులకు కూడా ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేశాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కోరమంగళలోని పోలీసులు ప్రస్తుతం పరిసరాలలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వారి ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..