AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anurag Thakur: స్వేచ్ఛ అనేది క్రియేటివిటీకి మాత్రమే.. అశ్లీలతకు కాదు.. OTT వెబ్‌ సిరీస్‌లో అసభ్యకరమైన భాషపై కేంద్ర మంత్రి సీరియస్

ఓటీటీల్లో వచ్చే కొన్ని చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు అసభ్యకరంగా ఉంటున్నాయని విమర్శలు వస్తోన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అవధులు దాటితే ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వెనకాడదని ముందస్తు..

Anurag Thakur: స్వేచ్ఛ అనేది క్రియేటివిటీకి మాత్రమే.. అశ్లీలతకు కాదు.. OTT వెబ్‌ సిరీస్‌లో అసభ్యకరమైన భాషపై కేంద్ర మంత్రి సీరియస్
Anurag Thakur
Sanjay Kasula
|

Updated on: Mar 20, 2023 | 7:23 AM

Share

స్వేచ్ఛ అనేది కేవలం సృజనాత్మకత కోసమేనని.. అశ్లీలతకు కాదని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ స్పష్టం చేశారు. ఓటీటీల్లో వచ్చే కొన్ని చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు అసభ్యకరంగా ఉంటున్నాయని విమర్శలు వస్తోన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అవధులు దాటితే ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వెనకాడదని ముందస్తు హెచ్చరికలు చేశారు. కేవలం సృజనాత్మకత కోసమే డిజిటల్‌ వేదికలకు స్వేచ్ఛ ఇచ్చారు.. అశ్లీలత, అసభ్యకరపదజాలం వాడేందుకు కాదు. అటువంటి వాటికి పాల్పడితే సహించేది లేదన్నారు. ఓటీటీ వేదికలపై అసభ్యకరమైన పదజాలం, అశ్లీల కంటెంట్‌పై ఫిర్యాదులు రావడంపై ప్రభుత్వం సీరియస్‌గానే ఉంది. ఇందులో మార్పులు తీసుకురావడానికి నిబంధనల్లో ఏమైనా మార్పులు అవసరమవుతాయా అనే కోణాన్ని ఐటీశాఖ పరిశీలిస్తున్నట్లుగా సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు.

ప్రస్తుత విధానం ప్రకారం, నిర్మాతలు ముందుగా కంటెంట్‌కు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించాలి.. ఆపై వారు తమ అసోసియేషన్‌కు వెళతారు. ప్రభుత్వానికి (ఐ అండ్ బి డిపార్ట్‌మెంట్) ఫిర్యాదు వచ్చినప్పుడు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. OTT ప్లాట్‌ఫారమ్‌లపై ఇలాంటి ఫిర్యాదులు పెరిగాయని, వాటిని డిపార్ట్‌మెంట్ సీరియస్‌గా తీసుకుంటోందని ఠాకూర్ తెలిపారు.

“తాము ఏవైనా మార్పులు చేయవలసి వస్తే.. అన్ని ఆలోచించిన తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు.  ఎందుకంటే స్వేచ్ఛ సృజనాత్మకత కోసం ఇవ్వబడింది. అసభ్యత లేదా అసభ్యకరమైన భాష కోసం కాదు. సృజనాత్మకత పేరుతో దూషణలు, తప్పుడు విషయాలు అంగీకరించబడవు. ”అన్నారు కేంద్ర మంత్రి.

ఇటీవల ఓటీటీలో విడుదలైన ఓ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన కేసు విచారణ సమయంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, “కాలేజీ రొమాన్స్‌”వంటి వెబ్‌ సిరీస్‌లో అసభ్యకరమైన భాష ఉందని, అటువంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో ఓటీటీ కంటెంట్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇదిలావుంటే తెలుగులో ఓటీటీల్లో కూడా కొన్ని వెబ్ సిరీస్‌ల్లో కూడా ఇలాంటి అసభ్యకరమైన భాష ఉపయోగించడంపై కూడా అభ్యంతరాలు రావడంతో కేంద్రం సీరియస్‌గా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం