Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage: పెళ్లి చేసుకోవాలనుకునే మగవారు ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే జీవితాంతం నరకమే..

కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.. మరికొందరు పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకుంటారు. ఏ రకమైన వివాహమైనా.. పెళ్లితో స్త్రీ, పురుషుడు ఒక జంటగా అవుతారు. తద్వారా ఒక కొత్త కుటుంబం ఏర్పడుతుంది. అయితే, గతంలో మాదిరిగా పెళ్లికి, వివాహ బంధానికి విలువ ఇవ్వడం లేదు నేటి జనరేషన్ ప్రజలు. అందుకే..

Marriage: పెళ్లి చేసుకోవాలనుకునే మగవారు ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే జీవితాంతం నరకమే..
Marriage
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 16, 2023 | 3:30 PM

కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.. మరికొందరు పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకుంటారు. ఏ రకమైన వివాహమైనా.. పెళ్లితో స్త్రీ, పురుషుడు ఒక జంటగా అవుతారు. తద్వారా ఒక కొత్త కుటుంబం ఏర్పడుతుంది. అయితే, గతంలో మాదిరిగా పెళ్లికి, వివాహ బంధానికి విలువ ఇవ్వడం లేదు నేటి జనరేషన్ ప్రజలు. అందుకే.. దేశంలో మనం రోజూ అనేక విడాకుల వార్తలు, భార్యభర్తల మధ్య ఘర్షణల వార్తలను చూస్తూనే ఉన్నాం. పెద్దలు కుదుర్చిని పెళ్లైనా, ప్రేమ వివాహమైనా విడిపోవడానికి, ఘర్షణలు చోటు చేసుకోవడానికి ఇద్దరి ప్రవర్తన కూడా ఒక కారణం. అయితే, ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలనుకునే పురుషులు, పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకునే ముందు చేయకూడని 5 తప్పులు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ తప్పులు చేయకుండా ఉండటం వల్ల వైవాహిక జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగించొచ్చు.

ఇతరుల మాటలు వినడం..

పెద్దలు కుదిర్చిన వివాహంలో కుటుంబం పెద్ద పాత్ర పోషిస్తుంది. కుటుంబ సభ్యులు నిర్ణయంపైనే వివాహం జరుగుతుందా? లేదా? అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఒక విషయంలో మాత్రం అలెర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. అన్ని విషయాల్లోనూ కుటుంబ సభ్యుల మాటలు వింటే.. భవిష్యత్‌లో మీరు ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. మీ ఇష్టాలు, అయిష్టాలకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే.. భవిష్యత్తులో మీరు వివాహం చేసుకున్న స్త్రీతో సఖ్యతో ఉండలేకపోతారు. అందుకే, అవగాహనతో, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వివాహం విషయంలో వేగం పనికిరాదు.

సేవింగ్స్ లేకుండా పెళ్లి..

ఒక వయస్సు వచ్చాక.. ఇంట్లో వాళ్లు, బయటి వారు అందరూ పెళ్లి చేసుకోమనికి ఎగబడుతుంటారు. మీరు ఏం చేస్తున్నారు, సంపాదన ఏంటి? కుటుంబాన్ని నిర్వహించే సామర్థ్యం ఉందా? లేదా? అనేది వారు చూడరు. పెళ్లి చేయడమే వారి లక్ష్యం. అయితే, పెళ్లి చేసుకోవాలనుకునే వారు పొరపాటున కూడా ఈ విషయంలో తప్పు చేయొద్దు. ఆర్థికంగా నిలదొక్కుకోకుండా, సంపాదనా సామర్థ్యం లేకుండా వివాహం చేసుకోవడంపై ఆలోచించాలి. లేదంటే భవిష్యత్‌లో ఎదురయ్యే ఆర్థిక కష్టాలకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

అన్నీ షేర్ చేసుకోవద్దు..

సాధారణంగానే చాలా మంది అబ్బాయిలు.. అమ్మాయిలకు ఎదురపడాలంటే సిగ్గు పడతారు. మాట్లాడటానికి మొహమాటపడుతారు. పెళ్లి చేసుకున్న భార్యతో కూడా చాలా మంది మాట్లాడేందుకు ఇబ్బంది పడుతారు. ఒక విధంగా ఇది ఇద్దరికీ మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. వారి వారి రహస్యాలు రహస్యాలుగానే ఉండిపోతాయని, ఒకరికొకరు తమ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోలేరు. తద్వారా ఇద్దరి తమ జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తారు.

ఆ తరువాత విచారించొద్దు..

కొందరు పెళ్లి తరువాత తమ భార్య, ఆమె కుటుంబం చర్యల గురించి విచారిస్తుంటారు. పెళ్లి తరువాత విచారించడం కంటే.. ముందే అలర్ట్‌గా ఉండటం మంచిది. పెళ్లికి ముందు వధువు కుటుంబం, వధువు గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. లేదంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతా ఓకే అయితే.. లైఫ్ కూడా సంతోషంగా సాగిపోతుంది.

ఇష్టం లేని వివాహం వొద్దు..

మన దేశంలో ఇప్పటికీ చాలా మంది మహిళలు కుటుంబ ఒత్తిడితోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడం వల్ల భర్తకు సపోర్ట్‌గా ఉండలేరు. భార్య, భర్త చేతులు కలిస్తేనే ఆ కాపురం సజావుగా సాగుతుంది. లేదంటే ఎడమొహం, పెడ మొహం అన్నట్లుగా ఉంటుంది. అందుకే.. పెళ్లికి ముందే ఈ పెళ్లి ఇష్టమో లేదో వధువును అడిగి తెలుసుకోవాలి. ఇష్టమైతే మీ వివాహ జీవితం సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రెస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఉగ్రదాడికి స్ట్రాంగ్ ఎన్కౌంటర్! ఇండియాలో PSL బ్యాన్
ఉగ్రదాడికి స్ట్రాంగ్ ఎన్కౌంటర్! ఇండియాలో PSL బ్యాన్
నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ ఆర్మీపై కాల్పులు
నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ ఆర్మీపై కాల్పులు
తొలి బంతికే సిక్స్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
తొలి బంతికే సిక్స్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
10th విద్యార్ధులకు 2025 అలర్ట్..పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే
10th విద్యార్ధులకు 2025 అలర్ట్..పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే
జూలై 3న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే
జూలై 3న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే
ఉగ్రవేటకు రంగం సిద్ధం.. నేడు పహల్గాంకు ఆర్మీ చీఫ్ రాక..!
ఉగ్రవేటకు రంగం సిద్ధం.. నేడు పహల్గాంకు ఆర్మీ చీఫ్ రాక..!
నా పని అయిపోయింది అనుకున్న! ఆక్సిడెంట్ పై ఫ్లింటాఫ్..
నా పని అయిపోయింది అనుకున్న! ఆక్సిడెంట్ పై ఫ్లింటాఫ్..
8 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 3వ విజయం కోసం చెన్నై, హైదరాబాద్ పోరు
8 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 3వ విజయం కోసం చెన్నై, హైదరాబాద్ పోరు
పాక్ కి గుణపాఠం చెప్పేందుకు వ్యూహాత్మకంగా భారత్ అడుగులు
పాక్ కి గుణపాఠం చెప్పేందుకు వ్యూహాత్మకంగా భారత్ అడుగులు
ఇంటర్‌లో ఫెయిల్.. UPSCసివిల్స్‌లో మాత్రం సత్తాచాటిన తెలుగు బిడ్డ!
ఇంటర్‌లో ఫెయిల్.. UPSCసివిల్స్‌లో మాత్రం సత్తాచాటిన తెలుగు బిడ్డ!