AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఛీ ఛీ.. ఆమె కోడలు అలాంటిదా? ఆళ్లగడ్డలో ఎక్కడ చూడు ఇదే డిస్కర్షన్..

ఆళ్లగడ్డ.. ఈ పేరంటే, వింటే కరెంట్‌ షాక్‌ కొట్టినంత వైబ్రేషన్‌.. తెరపైన కానీ తెర వెనక కానీ సీమ ఫ్రేమ్‌లో ఆళ్లగడ్డ సౌండ్‌ వచ్చిందంటే దడ దడ. అయితే అవన్నీ ఎప్పుడో ఒడిసిన ముచ్చట్లు.. ఫ్యాక్షన్‌ కోరలు ఎప్పుడో కత్తిరించబడ్డాయి.. కానీ ఈ ‘ముంతాజ్‌’ కీ కహానీ తెలిసి ఆళ్ల గడ్డే ఉలిక్కి పడింది. అంతేకాదు.. యావత్ ఆంధ్రానే అద్దిరిపడేంత పనైంది.

Andhra Pradesh: ఛీ ఛీ.. ఆమె కోడలు అలాంటిదా? ఆళ్లగడ్డలో ఎక్కడ చూడు ఇదే డిస్కర్షన్..
Allagadda
Shiva Prajapati
|

Updated on: Apr 15, 2023 | 9:45 PM

Share

ఆళ్లగడ్డ.. ఈ పేరంటే, వింటే కరెంట్‌ షాక్‌ కొట్టినంత వైబ్రేషన్‌.. తెరపైన కానీ తెర వెనక కానీ సీమ ఫ్రేమ్‌లో ఆళ్లగడ్డ సౌండ్‌ వచ్చిందంటే దడ దడ. అయితే అవన్నీ ఎప్పుడో ఒడిసిన ముచ్చట్లు.. ఫ్యాక్షన్‌ కోరలు ఎప్పుడో కత్తిరించబడ్డాయి.. కానీ ఈ ‘ముంతాజ్‌’ కీ కహానీ తెలిసి ఆళ్లగడ్డే ఉలిక్కి పడింది. అంతేకాదు.. యావత్ ఆంధ్రానే అద్దిరిపడేంత పనైంది.

ముంతాజ్‌ అంత పనిచేసిందా? చూడబోతే అమాయకం ఫేసు. కానీ ఆమెలో అంత విషయం.. విషం వుందా? వారెవ్వా.. అప్పుడు ఎంతలా ఏడ్చింది.. అత్త చనిపోతే కన్నతల్లి చనిపోయినంత బాధతో కన్నీరు పెట్టింది కదా! ఆ ఏడుపు నిజం కాదా? అసలు కత అదా! నిజం తెలిసి ఆళ్లగడ్డ జనం నోట నుంచి వస్తున్న మాటలు ఇవి. ఏ ఇద్దరు ఎదురుపడ్డా ఈ కహానీ చెప్పుకుంటూనే నివ్వెరపోతున్నారు. ఇంతకీ ముంతాజ్‌ ఎవరు? ఆమె ఏం చేసింది? ఆమె అత్త జమాలమ్మది సహజ మరణం కాదా? ఆమె భర్త ఎప్పుడు చనిపోయాడు? ఎలా చనిపోయాడు. మ్యాటర్ అంతా తెలిస్తే మీటర్ లేచిపోవడం ఖాయం.

ఆళ్లగడ్డకు చెందిన జమాలమ్మ అందరితో ఎంతో ఆత్మీయంగా ఉండేది. అలాంటి జమాలమ్మ చనిపోయిందని తెలిసి బంధువులు, స్థానికులు బాధపడ్డారు. జమాలమ్మ బాగానే ఉండేది. రాత్రి వరకు బాగానే ఉంది కూడా. ఏ జలుబు, జ్వరమూ లేదు. మరి సడెన్‌గా ఎలా చనిపోయింది? కొందరికి డౌట్‌ రానే వచ్చింది. ఒకరో ఇద్దరో అసలేం జరిగిందని ఆరా తీద్దామనుకున్నారు. అంతే ఓవైపు ఏడుస్తూనే మరోవైపు వాళ్లకు సమాధానం చెప్పింది ముంతాజ్‌. అత్త.. అత్తా.. గుండెపోటుతో చనిపోయిందంటూ విషాదభరిత సీనును రక్తి కట్టించింది. ఈ మధ్య హార్ట్‌ అటాక్‌ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి కదా. అంతా నిజమే కాబోలని నమ్మేశారు. అయ్యో పాపం.. మంచి మనిషి అంటూ జమాలమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. ముంతాజ్‌ ఐడియా వర్కౌట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

అయితే, జనాలను నమ్మించవచ్చు. కానీ కాలాన్ని బంధించడం సాధ్యమా? కాలం సమాధానం చెప్పింది. ఒకటి కాదు రెండు హత్యలకు సంబంధించిన షాకింగ్‌ నిజాలు తెరపైకి వచ్చాయి. నిజ నిర్ధారణ కోసం స్మశానంలో సమాధుల తవ్వకం మొదలైంది. జమాలమ్మది సహజ మరణం కాదు. హత్యేననే ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అత్త చనిపోయిందని కన్నీరు పెట్టిన ముంతాజ్‌ అసలు వ్యవహారం ఏంటో విచారణలో తేలింది.

ఔనా.. ఆమె అంత పనిచేసిందా? అత్తను ఎందుకని చంపింది? ఆ ప్రశ్నలతో పాటు రాము హత్య కూడా ముంతాజ్‌ పనేనని తెలిసి ఆళ్లగడ్డ నివ్వెరపోయింది. ఇంకా షాకింగ్‌ న్యూస్‌ ఏంటంటే.. అత్త జమాలమ్మ కన్నా ముందే వాళ్లింట్లో రాము చనిపోయాడు. రాము మరెవరో కాదు జమాలమ్మ కుమారుడు. ముంతాజ్ భర్త. 40 రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు మృతి. ఇద్దరివీ సహజ మరణాలు కావు. నెత్తురు చుక్క నేలరాలకుండా భర్తను.. అత్తను ఖతమ్‌ చేసిన ముంతాజ్‌ క్రైమ్‌ కథా చిత్రానికి పోలీసులు ఎట్టకేలకు ఎండ్‌ కార్డ్‌ వేశారు.

జనవరి 5న రాము చనిపోయాడు. హార్ట్‌ స్ట్రోక్‌తో చనిపోయాడని అందర్నీ నమ్మించింది ముంతాజ్‌. కానీ బంధుమిత్రులను బోల్తా కొట్టించాననుకుంది. కానీ ఎంతటి నేరస్తుడైనా ఏదో ఒక చిన్న క్లూతో చట్టానికి చిక్కక తప్పదు కదా. ఈ కేసులోనూ అదే జరిగింది. ముంతాజ్‌.. రాముకు రెండో భార్య. భర్త..అత్తా చనిపోయారన్న బాధ ఆమెలో అంతగా లేకపోవడం.. గతంలో కన్నా ఎక్కువ హుషారుగా చక్కర్లు కొట్టడం గమనించాడు మామ జమాలయ్య. మరోవైపు రాము పెద్ద భార్య కుమారుడికి కూడా పిన్నీ తీరుపై అనుమానం కలిగింది. ఫోన్‌ చెక్‌ చేస్తే పక్కింటి టీచర్‌ భార్యతో ముంతాజ్‌ మాట్లాడిన కాల్‌రికార్డ్స్‌ కంటపడ్డాయి. వింటే షాకింగ్‌ నిజాలు తెరపైకి వచ్చాయి. ఆడియో రికార్డ్స్‌ను తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. రాము, జమలామ్మవి హత్యేలేనన్న ఫిర్యాదుతో కూపీలాగితే నిజం బయటపడింది. హార్ట్‌ అటాక్‌తో కాదు.. రాము చనిపోయింది ముంతాజ్‌ గొంతు పిసకడం వల్ల అనే షాకింగ్‌ ట్రూత్‌ సంచలనం రేపింది.

విచారణలో భాగంగా జమాలమ్మ, రాము మృతదేహాలను వెలికి తీశారు. అధికారుల సమక్షంలో శవపంచానమా నిర్వహించారు. మరోవైపు ముంతాజ్‌ను అదుపులోకి తీసుకొని ఆరా తీస్తే.. తిరుగులేని సాక్ష్యాలు ముందు ఉండడంతో నేరాన్ని ఒప్పుకుందామె.

భర్తను.. అత్తను.. 40 రోజులు వ్యవధిలో ఇద్దర్నీ హత్య చేసి.. గుండెపోటు ఖాతాల్లో కలిపేయాలనుకుంది ముంతాజ్‌. కానీ చిన్న అనుమానంతో కథ అడ్డం తిరిగింది. అరెస్ట్‌ పర్వంతో ముంతాజ్‌ కథ కటకటాలకు చేరింది. మరి ఆమె ఎందుకు ఈ హత్యల చేసింది. ఒక్కతేనా? ఎవరైనా సహకరించారా? క్రైమ్‌ సినిమాను తలదన్నేలా ఉన్న ఈ ఎపిసోడ్‌లో ఇంకెన్ని సంచలనాలు ఉన్నాయో.. అనే చర్చజరుగుతోంది స్థానికంగా.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..