- Telugu News Photo Gallery Spiritual photos Akshaya Tritiya 2023: Remove These 5 Things From Your House Before Akshaya Tritiya
Akshaya Tritiya-2023: అక్షయ తృతీయకు ముందు ఇంట్లోంచి ఈ 5 వస్తువులు పడేయండి.. లక్ష్మీదేవి దయతో డబ్బే డబ్బు..!
అక్షయ తృతీయ.. ఈ రోజులు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు ప్రజలు. ఈ రోజున చేపట్టే కార్యక్రమాలు ఫలిస్తాయని విశ్వసిస్తారు. అంతేకాదు.. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి, వజ్రాభరణాలను కొనుగోలు చేస్తే అంతా శుభం జరుగుతుందని, సిరిసంపదలు వస్తాయని నమ్మకం.
Updated on: Apr 14, 2023 | 9:02 PM

అక్షయ తృతీయ.. ఈ రోజులు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు ప్రజలు. ఈ రోజున చేపట్టే కార్యక్రమాలు ఫలిస్తాయని విశ్వసిస్తారు. అంతేకాదు.. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి, వజ్రాభరణాలను కొనుగోలు చేస్తే అంతా శుభం జరుగుతుందని, సిరిసంపదలు వస్తాయని నమ్మకం.

అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా అమ్మవారి ఆశీర్వాదం పొందవచ్చు. అయితే, అక్షయ తృతీయకు ముందు మీరు ఒక పని చేయాల్సి ఉంది. అది చేస్తే ఇప్పటి ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి.. తిరిగి లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది.

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని కలిగించే వస్తువుల చాలా ఉంటాయి. వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల లక్ష్మీ దేవి ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఫలితంగా ఆర్థికంగా చితికిపోతారు. అందుకే నెగిటివ్ ఎనర్జీకి కారణమయ్యే వస్తువులను వెంటనే ఇంట్లోంచి బయట పడేయాలి. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున కొన్ని విలువైన వస్తువులను ఇంట్లోకి తీసుకురావడం వల్ల ఐశ్యర్యం సిద్ధిస్తుంది. అదే సమయంలో ఈ రోజున ఇంట్లోంచి బయటపడేసే వస్తువులు కూడా ఉన్నాయి. మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చీపురు. వాస్తవానికి చీపురు లక్ష్మీ దేవికి చిహ్నంగా పేర్కొంటారు. చీపురు గురించి గ్రంధాలలో అనేక నియమాలు ఉన్నాయి. వాటిని పాటించకపోవడం వల్ల ఇంట్లో దురదృష్టం తాండవిస్తుంది. అందుకే అక్షయ తృతీయ రోజున ఇంట్లో విరిగిన చీపురు ఉంటే బయట పడేయాలి. విరిగిపోయిన చీపురు ఇంట్లో ఉంటే.. లక్ష్మీ దేవికి ఆగ్రహం కలుగుతుంది. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇంట్లో విరిగిపోయిన, పాత చెప్పులు ఉండటం మంచిది కాదు. లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణం అవుతాయి. పాడైపోయిన చెప్పులను బయటపడేయాలి. అక్షయ తృతీయ రోజున కొత్త వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది. అలాగే, అక్షయ తృతీయకు ముందు ఇంట్లో ఉన్న పగిలిన పాత్రలను బయట పడేయాలి. విరిగిన పాత్రలు ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి. కుటుంబంలో అశాంతిని కలుగజేస్తాయి. అందుకే పాడైపోయిన, విరిగిన పాత్రలను బయటపడేయాలి.

డస్ట్ బిన్‌ను ఇంట్లో ఉంచొద్దు. గేటు బయట ప్రత్యేక స్థలంలో ఉంచాలి. ప్రధాన తలుపు వద్ద పరిశుభ్రత పాటించాలి. అపరిశుభ్రంగా ఉంటే.. లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. తద్వారా ఆర్థిక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది

ఇంట్లో ఎండిపోయిన మొక్కలను కూడా ఉంచొద్దు. ఒకవేళ ఎండిపోయిన మొక్కలుంటే భూమిలో పాతిపెట్టాలి. లేదా ప్రవహించే నీటిలో వేయాలి. ఎండిపోయిన మొక్కలు ఇంట్లో వాస్తు దోషాన్ని కలిగిస్తాయి. లక్ష్మిదేవి అనుగ్రహం పొందాలంటే, అక్షయ తృతీయ లోపు ఎండిన మొక్కలను తొలగించాలి. గమనిక: పైన పేర్కొన్న వివరాలు, మత గ్రంధాల్లోని సమాచారం, జ్యోతిష్య పండితుల సూచనలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.




