Bizarre: అమ్మబాబోయ్.. అంగారకుడిపై వింత ఆకారం.. సంచలనం సృష్టిస్తున్న ఫోటోలు..

మన సౌరకుటుంబంలోని గ్రహాలలో జీవం మనుగడకు అవకాశం ఉన్న గ్రహాలలలో భూమి తరువాత అంగాకర గ్రహంపై ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పప్రంచ దేశాలన్నీ అంగాకర గ్రహంపై పరిశోధనలు జరుపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించింది.

Bizarre: అమ్మబాబోయ్.. అంగారకుడిపై వింత ఆకారం.. సంచలనం సృష్టిస్తున్న ఫోటోలు..
Perseverance Rover
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 14, 2023 | 5:37 PM

మన సౌరకుటుంబంలోని గ్రహాలలో జీవం మనుగడకు అవకాశం ఉన్న గ్రహాలలలో భూమి తరువాత అంగాకర గ్రహంపై ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పప్రంచ దేశాలన్నీ అంగాకర గ్రహంపై పరిశోధనలు జరుపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించింది. నాసాకు చెందిన పర్సీవరెన్స్ రోవర్ అంగారకుడిని అణువణువూ పరిశీలిస్తోంది. ప్రతీ దృశ్యాన్ని తన కెమెరాలో బంధిస్తోంది. తాజాగా పర్సీవరెన్స్ రోవర్ మార్స్‌కు సంబంధించిన షాకింగ్ ఫోటోలను పంపింది. అంగాకర గ్రహంపై వింతైన ఎముక లాంటి నిర్మాణాలను రోవర్ కనుగొంది. ఇవి డ్రాగన్ మార్టిన్‌తో పోలుస్తున్నారు పరిశోధకులు.

ఈ రోవర్ పంపిన ఫోటోల్లో చేపల ఎముక శిలాజాల నుంచి డ్రాగన్ లాంటీ జీవి మాదరిగా ఉన్నాయి దృశ్యాలు. ఈ ఫోటోలను నాసా విడుదల చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వింత ఆకారాలను చూసి స్టన్ అవుతున్నారు ప్రజలు. అయితే, మార్టిన్ విండ్స్ పెద్ద విస్తీర్ణంలోని రాళ్లను ధ్వంసం చేయడం వలన ఈ ఆకారాలు ఏర్పడి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఆస్ట్రోబయాలజిస్ట్ నథాలీ కాబ్రోల్.. ‘మార్స్‌పై అధ్యయనం చేసిన 20 సంవత్సరాలలో ఇది నేను చూసి అత్యంత విచిత్రమైన రాయి’ అని పేర్కొన్నారు. ఈ ఫోటోలపై నెటిజర్లు, పరిశోధకులు తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.

ఇవి కూడా చదవండి
Nasa Finds Dragon Bone

Nasa Finds Dragon Bone

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..