Lord Ram: సుందర రూపుడు శ్రీరాముడు.. 21 ఏళ్ల వయసులో ఇలా ఉండేవాడా..!

జగదభిరాముడు, సుగుణాభి రాముడు, నీలమేఘశ్యాముడు.. ఇలా శ్రీరాముడికి ఎన్నో పేర్లు. అలాగే మనం కీర్తించే పేర్లలో రాముడు అందాల రాముడు కూడా. రాముడ్ని మించిన అందగాడు, సీతను మించిన అందగత్తె ఉండరని పురాణ ప్రతీతి. సాధారణంగా మనం చూసే రాముడు ఎప్పుడూ ఒక్కటే రూపు. అసలు శ్రీరాముడు ఎలా ఉంటాడు.

Lord Ram: సుందర రూపుడు శ్రీరాముడు.. 21 ఏళ్ల వయసులో ఇలా ఉండేవాడా..!
Lord Rama
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 13, 2023 | 3:18 PM

జగదభిరాముడు, సుగుణాభి రాముడు, నీలమేఘశ్యాముడు.. ఇలా శ్రీరాముడికి ఎన్నో పేర్లు. అలాగే మనం కీర్తించే పేర్లలో రాముడు అందాల రాముడు కూడా. రాముడ్ని మించిన అందగాడు, సీతను మించిన అందగత్తె ఉండరని పురాణ ప్రతీతి. సాధారణంగా మనం చూసే రాముడు ఎప్పుడూ ఒక్కటే రూపు. అసలు శ్రీరాముడు ఎలా ఉంటాడు. ఉంటే 21 ఏళ్ల వయసులో ఎలా ఉంటాడు అన్నది ఓ వ్యక్తికి వచ్చిన ప్రశ్న. దాన్ని కనుక్కోడానికి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ను వాడాడు.

ఇంతకీ 21 ఏళ్ల వయసులో రాముడు ఎలా ఉంటాడో చూస్తారా? AI ఎలాంటి రూపాన్ని కళ్లముందు ఉంచిదో చూస్తారా.. ఇదిగో చూసేయండి..

ఇవి కూడా చదవండి

ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ AI సృష్టించిన అందాల రాముడు ఇతనే. చూడచక్కని మోము. ఇంత సున్నితత్వాన్ని, సుతిమెత్తనితనాన్ని దర్శింపజేసే స్వరూపం, పట్టుకుంటే కందిపోతాడేమో అనిపించే రూపం.. ఇదీ AI తీసుకొచ్చిన శ్రీరాముడి స్వరూపం

ఇంతకీ AI దీన్ని ఎలా తీసుకొచ్చిందన్న అనుమానం రావచ్చు. దానికి సదరు వ్యక్తి వాల్మీకి రామాయణం, రామచరిత మానస్ వంటి గ్రంథాల్లో ఇచ్చిన రాముడి రూపురేఖలను ఇన్‌పుట్స్‌గా ఇవ్వడం ద్వారా రాముడి రూపాన్ని సృష్టించింది కృత్రిమ మేధస్సు.

రాముడు అచ్చుగుద్దినట్లు ఇలాగే ఉండేవాడా అంటే ఎవరూ చూసింది లేదుగానీ.. AI తీసుకొచ్చిన రూపురేఖలను చూసి మాత్రం రామభక్తులు తన్మయత్వం చెందుతున్నారు. సాధారణంగా చూసే ఫోటోలకు వందరెట్లు అందంగా రాముడ్ని చూపించడం చూసి జై శ్రీరామ్ అంటున్నారు. ఇంతకీ ఈ AI రామ చిత్రాన్ని సృష్టించింది ఎవరో తెలీదుగానీ.. నెట్టింట మాత్రం వైరల్ అవుతోంది ఈ శ్రీరాముడే.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..