Vitamins For Strong Nerves: నరాల బలహీనతతో బాధపడుతున్నారా? ఈ 5 పదార్థాలు అద్భుత ఫలితాన్నిస్తాయి..

మన శరీరంలో నాడీ వ్యవస్థకు క్లిష్టమైన పాత్ర ఉంది. నరాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. ఏదైనా కారణాల వల్ల నరాల్లో సమస్య వస్తే శరీరం బలహీనపడుతుంది. నరాల సమస్యలు లేకుంటే మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి.

Vitamins For Strong Nerves: నరాల బలహీనతతో బాధపడుతున్నారా? ఈ 5 పదార్థాలు అద్భుత ఫలితాన్నిస్తాయి..
Strong Nerves
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 12, 2023 | 9:50 PM

మన శరీరంలో నాడీ వ్యవస్థకు క్లిష్టమైన పాత్ర ఉంది. నరాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. ఏదైనా కారణాల వల్ల నరాల్లో సమస్య వస్తే శరీరం బలహీనపడుతుంది. నరాల సమస్యలు లేకుంటే మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. నరాల సమస్యలు కొన్నిసార్లు జన్యుపరమైనవి ఉంటాయి. అలాగే శరీరంలో విటమిన్లు లేకపోయినా ఈ నరాల సమస్య రావచ్చు. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఈ 5 విటమిన్లు రెగ్యులర్ గా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు చెబుతున్నారు.

1. విటమిన్ బి12 నరాల నిర్మాణంలో బాగా పనిచేస్తుంది. ఈ విటమిన్ శరీరానికి అత్యంత కీలకమైనది. ఏ కారణం చేతనైనా ఈ విటమిన్ లోపిస్తే శరీరం బలహీనంగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో గుడ్లు, మాంసం, పుట్టగొడుగులు, బచ్చలికూరను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

2. విటమిన్ B9ని ఫోలిక్ యాసిడ్ అంటారు. ఈ విటమిన్ B9 నరాలకు చాలా అవసరం. ఈ విటమిన్ B9 గర్భిణీ స్త్రీలకు చాలా ముఖ్యమైనది. ఇది పిండం నాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది. ప్రతిరోజూ కూరగాయలు, సోయాబీన్స్, బీన్స్ తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విటమిన్లు లోపించవు. కివీని రోజూ తింటే చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

3. విటమిన్ ఇ శరీరానికి చాలా అవసరం. కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు ఈ విటమిన్ చాలా బాగా పనిచేస్తుంది. వెజిటబుల్ ఆయిల్స్, బాదం, వాల్‌నట్స్, కివీస్‌లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.

4. విటమిన్ B6, B1, ఈ రెండు విటమిన్లు శరీరానికి అవసరం. ఈ రెండు విటమిన్లు శరీరంలోని నాడీ వ్యవస్థను చురుగ్గా ఉంచడంలో బాగా ఉపయోగపడతాయి. అరటిపండ్లు, గింజలు, పచ్చి కూరగాయలలో ఈ రెండు విటమిన్లు ఉంటాయి. మీరు ప్రతిరోజూ 2 చెంచాల ఓట్స్, ఆకుపచ్చ కూరగాయలను తినడం ద్వారా విటమిన్ B12 లోపాన్ని తగ్గించుకోవచ్చు. బయటి ఆహారం, ఆల్కహాల్, రెడ్ మీట్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్