- Telugu News Photo Gallery Health Tips Have you been eating bananas on an empty stomach? Know about side effects of Health
Health Tips: అరటిపండు విషయంలో ఈ పొరపాటు అస్సలు చేయొద్దు.. షుగర్ లెవల్స్ పెరుగుతాయి..
ఆరోగ్య నిపుణుల నుంచి పోషకాహార నిపుణుల వరకు అందరూ అల్పాహారం ప్రాముఖ్యతను వివరిస్తుంటారు. ప్రతి రోజూ ఉదయం ఆరోగ్యకరమైన, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండే ఆహారాన్ని తినాలని సూచిస్తుంటారు. అయితే, కొందరు తమ టైమ్ షెడ్యూల్ కారణంగా అల్పాహారం దాటేస్తుంటారు. దాని ప్లేస్‌లో అరటిపండ్లు తింటారు.
Updated on: Apr 11, 2023 | 2:17 PM

ఆరోగ్య నిపుణుల నుంచి పోషకాహార నిపుణుల వరకు అందరూ అల్పాహారం ప్రాముఖ్యతను వివరిస్తుంటారు. ప్రతి రోజూ ఉదయం ఆరోగ్యకరమైన, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండే ఆహారాన్ని తినాలని సూచిస్తుంటారు. అయితే, కొందరు తమ టైమ్ షెడ్యూల్ కారణంగా అల్పాహారం దాటేస్తుంటారు. దాని ప్లేస్‌లో అరటిపండ్లు తింటారు.

అరటిపండులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వాటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల జీవక్రియపై ప్రభావం చూపుతుంది. ఇది జీర్ణక్రియకు ఆటంకాలు కలిగిస్తుంది. ఒక్కోసారి గుండె ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది.

బరువు తగ్గేందుకు చాలామంది అరటిపండ్లను ఖాళీ కడుపుతో తింటారు. అరటిపండ్లు తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. అలాగే, అరటిపండ్లు తినడం వల్ల తక్షణ శక్తి పెరుగుతుంది. అయితే, ఎక్కువ సేపు ఏమీ తినకుండా ఉంటే శరీరం అలసిపోతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ విషయంలో మరింత అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. అరటిపండులో పోషకాలతో పాటు సహజ చక్కెరలు కూడా ఉంటాయి. ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది అస్సలు మంచిది కాదు.

అల్పాహారంలో అరటిపండు తినడం మంచిదే. అయితే, ఖాళీ కడుపుతో తినకూడదు. వోట్మీల్ కలిపి అరటిపండ్లను తినవచ్చు. ఇతర పండ్లతో కలిపి అరటిపండ్లనుతినవచ్చు. ఇది ఆరోగ్యకరమైన మార్గం.